
సాక్షి, కామారెడ్డి : ప్రేమ విఫలమైందనే కారణంతో మనస్తాపం చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం కామారెడ్డి పట్టణం అశోక్‌నగర్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. అశోక్ నగర్ కాలనీకి చెందిన సంతోష్(23) కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా ఒక యువతిని ప్రేమిస్తున్న సంతోష్, సదరు యువతి ప్రేమను నిరాకరించిందనే కారణంతో ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు, స్థానికులు భావిస్తున్నారు. కాగా సంతోష్ చనిపోయే అరగంట ముందు టిక్‌టాక్‌లో వీడియో తీశాడు. దానిని అప్‌డేట్ చేసి తన స్టేటస్‌గా పెట్టుకున్నాడు. సంతోష్ స్వస్థలం కామారెడ్డి మండలం తిమ్మక్కపల్లి కాగా కొంతకాలంగా తల్లితో కలిసి అశోక్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు.గతంలో సంతోష్ తండ్రి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడగా, తాజా ఘటనతో వారి కుటుంబంలో పెను విషాదం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment