సాక్షి,ఉరవకొండ( అనంతపురం): యువతి తన ప్రేమను నిరాకరించడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... ఉరవకొండలోని అంబేడ్కర్ నగర్‌కు చెందిన షణ్ముఖ (25).. నాలుగేళ్లుగా స్థానిక ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. రెండు రోజుల క్రితం తన ప్రేమను ఆమె ముందు వ్యక్తపరిచాడు. ఆ సమయంలో ఆమె నిరాకరించడంతో మనస్తాపానికి గురైన షణ్ముఖ... నిర్మాణంలో ఉన్న షాదీఖానాలో ఇనుప కడ్డీకి తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై ఎస్‌ఐ రమేష్‌రెడ్డి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment