ఆత్మాహుతికి యత్నించిన దివ్య రోస్లిన్
చెన్నై ,అన్నానగర్: ప్రియుడు వివాహాం చేసుకోవడానికి అంగీకరించలేదని మంగళవారం దిండుగల్ కలెక్టర్ ఇంటి ముందు యువతి ఆత్మాహుతి చేసుకోవడానికి యత్నించింది. మంగళవారం యువతి సహా ముగ్గురు వ్యక్తులు కలెక్టర్ ఇంటి ముందు వచ్చారు. అనంతరం ఆ యువతి హఠాత్తుగా బాటిల్‌లో ఉన్న పెట్రోల్‌ను తన శరీరం మీద పోసుకుని మంటలు పెట్టుకోవడానికి యత్నించింది. వెంటనే స్థానికులు ఆమెపై నీళ్లు పోసి రక్షించారు. దీంతో ఆ మహిళతో సహా ఆ ముగ్గురు నేలపై కూర్చొని ధర్నా చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి ముగ్గురిని పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఆత్మాహుతికి యత్నించిన యువతిని పోలీసులు విచారణ చేశారు.
విచారణలో ఆమె దిండుక్కల్ మేట్టుపట్టికి చెందిన దివ్యరోస్లిన్ (24) అని తెలసింది. ఆమె వెంట వచ్చిన వారు తండ్రి ప్రాన్సిస్, తల్లి జెమినామేరి అని తెలిసింది. పోలిసుల దివ్యరోస్లిన్ చెప్పిన వివరాల ప్రకారం.. ‘‘దిండుక్కల్– పళణి రోడ్డులో ఉన్న ఓ ఇంజినీరింగ్ కశాశాలలో నేను బీఈ చదివాను. అదే కళాశాలకి చెందిన పళణి తిరునగర్‌కు చెందిన ఓ యువకుడిని ప్రేమించాను. నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. ప్రస్తుతం నన్ను పెళ్లి చేసుకోవడానికి అంగీకరించడం లేదు. కాబట్టి ప్రియుడితో వివాహాం జరిపించమని దిండుగల్ మహిళ పోలీసుస్టేషన్‌లో, కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశాను. కానీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీయకపోవడం వలన విరక్తితో ఆత్మాహుతికి యత్నించాను.’’ అని దివ్యరోస్లిన్ చెప్పింది. ఫిర్యాదు ఆధారంగా దిండుగల్‌లో మహిళా పోలీసులు విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment