
కిశోర్ గౌడ్
సాక్షి, కర్నూలు(డోన్): ప్రేమ విఫలం కావడంతో ఓ యువకుడు రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల మేరకు.. కొండపేటకు చెందిన కృష్ణమూర్తి గౌడ్(లేట్), లలిత దంపతుల కుమారుడు కిశోర్ గౌడ్ (22) ప్రభుత్వ ఐటీఐలో శిక్షణ పూర్తిచేసుకొని ఉద్యోగ వేటలో ఉన్నాడు. ఇటీవల పట్టణానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమించాడు. అయితే ఆ అమ్మాయి కిశోర్ ప్రేమను తిరస్కరించింది. దీంతో తీవ్రమనస్తాపానికి గురయ్యాడు. ఈక్రమంలో గురువారం తెల్లవారుజామున రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు రైల్వే హెడ్‌కానిస్టేబుల్ ఖాదర్‌బాషా తెలిపారు. కుమారుడి మృతితో తల్లి కన్నీరుమున్నీరైంది.