
నిందితుడు మాధవరావు
సాక్షి, సిటీబ్యూరో: రోజురోజుకూ మారుతున్న ఆధునిక సాంకేతికతతోనే సైబర్ వేధింపులను సరికొత్త మార్గంలో చేస్తున్నారు. ఇన్నాళ్లు ఫేస్‌బుక్, ట్విట్టర్, అర్కుట్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా మహిళలు, యువతులను వేధిస్తున్న సైబర్ స్టాకర్స్ రూటు మార్చారు. మెదడుకు పదునుపెట్టి సరికొత్త రీతిలో ఆన్‌లైన్ వేధింపులు చేస్తున్నారు. నిందితుడు హైదరాబాద్‌లోనే ఉంటూ అమెరికా ఫోన్ నంబర్ ద్వారా అక్కడి నుంచి వేధింపులకు పాల్పడుతున్నట్టగా నమ్మించేలా చేసిన కేసు రాచకొండ సైబర్ క్రైమ్ ఠాణాలో తొలిది నమోదైంది. పోలీసులు రివర్స్ ఇంజనీరింగ్ ద్వారా ఆ మొబైల్ నంబర్ కనిపెట్టడంతో నిందితుడు నిజాంపేటకు చెందిన ప్రైవేట్ ఉద్యోగి కోట్ల మాధవ్‌రావును రాచకొండ సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ రాము నేతృత్వంలోని బృందం గురువారం అరెస్టు చేసింది.
అమెరికా నుంచే వేధింపులు చేస్తున్నట్టుగా...
మాధవ్‌రావు డిగ్రీ క్లాస్‌మేట్ అయిన బాధితురాలి అక్కకు 2015 సంవత్సరంలోకాంటాక్ట్‌లోకి వచ్చాడు. గతంలో ఉన్న కాస్తా పరిచయంతో స్నేహితులుగా మారారు. కొన్నిరోజులకే ప్రేమిస్తున్నానంటూ మాధవ్‌రావు చెప్పడంతో ఆమె తిరస్కరించింది. కొన్నిరోజుల తర్వాత హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం వచ్చిన మాధవ్‌రావు తన ప్రేమను తిరస్కరించిన యువతిపై కక్ష కట్టాడు. తనకున్న టెక్నికల్ నాలెడ్జ్‌తో గూగుల్ ప్లేస్టోర్‌లోని ఓ యాప్ ద్వారా అమెరికా ఫోన్ నంబర్ (వర్చువల్ నంబర్ ఎవరూ ఉపయోగించనిది) డౌన్‌లోడ్ చేసుకొని వాట్సాప్ వినియోగించడం మొదలెట్టాడు. ఆ తర్వాత ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి పంపాడు. వీడియోలు కూడా పంపాడు. శారీరక వాంఛ తీర్చాలంటూ రకరకాల మెసేజ్‌లు వాట్సాప్ చేశాడు. ఈ వేధింపులు తారాస్థాయికి వెళ్లడంతో బాధితురాలు రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదుచేసింది. కేసు నమోదుచేసుకున్న ఇన్‌స్పెక్టర్ రాము నేతృత్వంలోని బృందం టెక్నికల్ టీమ్‌తో బాగా అధ్యయనం చేసి చివరకు నిందితుడు మాధవరావును పట్టుకున్నారు. వర్చువల్ నంబర్ ఉపయోగించి వాట్సాప్ వేధింపుల వేధించిన తొలి కేసు ఇదేనని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment