సిద్దిపేటకమాన్: ప్రేమ విఫలమై యవకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సిద్దిపేట పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో గురువారం వెలుగు చూసింది. సిద్దిపేట వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట పట్టణం హౌసింగ్ బోర్డులో నివాసం ఉంటున్న మనోజ్‌కుమార్ (33) పట్టణంలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. కొంత కాలంగా మనోజ్‌కుమార్ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఈ విషయంపై గతంలో పెద్దలు ఇరువురికి రాజీ కుదుర్చారు.
ఈ క్రమంలో మనోజ్‌కుమార్ బుధవారం రాత్రి అమ్మాయితో ఫోన్‌లో మాట్లాడుతూ ఉద్వేగానికి గురయ్యాడు. సర్జికల్ బ్లేడ్‌తో చేతి మణికట్టు, ఆపై గొంతు భాగంలో కొసుకున్నాడు. వెంటనే అమ్మాయి మనోజ్‌కుమార్ కుటుంబ సభ్యులకు ఫోన్‌లో తెలిపింది. దీంతో మనోజ్ కుటుంబీకులు హుటాహుటిన అతడి గదికి వెళ్లి చూడగా రక్తం మడుగులో పడి ఉన్నాడు. తీవ్రంగా గాయపడిన అతడిని వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు మనోజ్ మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి తండ్రి కనకయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment