తిరువొత్తియూరు: యువతి ప్రేమించలేదన్న మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనను సెల్ఫీ తీసి ప్రేమించిన విద్యార్థిని వాట్సాప్‌నకు పంపాడు. అనంతరం యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన తమిళనాడునులోని కోవై సమీపం సింగనల్లూరులో శుక్రవారం రాత్రి జరిగింది. వివరాలు.. కోవై, సింగనల్లూరుకు చెందిన సత్యశీలన్ కుమారుడు హరిహరసుదన్ (19). ఇతను ఈసానరిలోని ప్రైవేట్ పాఠశాలలో బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.
అతను మరో కళాశాలకు చెందిన ఓ విద్యార్థినిని చాలాకాలంగా ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల ముందు హరిహరసుదన్ తన ప్రేమ సంగతిని ఆ విద్యార్థినికి తెలిపాడు. ఆ విద్యార్థిని ప్రేమను తిరస్కరించి అతన్ని తిట్టి పంపినట్టు తెలిసింది. దీంతో విరక్తి చెందిన హరిహరసుదన్ శుక్రవారం రాత్రి తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకున్నట్లు వేలాడి సెల్ఫీ తీసుకున్నాడు. ఆ చిత్రాన్ని ఆ యువతి వాట్సాప్‌నకు పంపాడు. తరువాత అతను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment