మహేంద్ర మృతదేహం
శాంతినగర్ (అలంపూర్ ): ప్రేమించిన యువతి మో సం చేసిందని మనస్తా పానికి గురైన ఓ యువకు డు సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేస్తూ పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన గురువారం అర్ధరాత్రి మానవ పాడు మండలం జక్కిరెడ్డిపల్లిలో చోటుచేసు కుంది. ఎస్‌ఐ మహేందర్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఉప్పరి మహేంద్ర(26) వారి కులానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఇటీవల ఆమెకు కుటుంబ సభ్యులు మరొకరితో వివాహం చేయడానికి పూనుకున్నారు.
విషయం తెలుసుకున్న మహేంద్ర మనస్తాపానికి గురయ్యాడు. అమ్మాయి కుటుంబ సభ్యులే గాక తాను ప్రేమించిన యువతి మోసం చేసిందని ఆవేదనతో గురువారం సాయంత్రం పురుగు మందు తాగాడు. తన ఆవేదనను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి తెలిసిన వాళ్లకు పంపాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే సంఘటన స్థలానికి చేరు కుని అపస్మారక స్థితిలో ఉన్న మహేంద్రను కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందు తూ అదేరోజు రాత్రి మృతిచెందాడు. శుక్రవారం పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం చేయించి కుటుంబసభ్యులకు అప్పగించారు. మహేంద్ర పెదనాన్న బీసన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment