
పటాన్‌చెరు టౌన్: వారిద్దరూ ప్రేమించుకున్నారు.. పెళ్లి విషయం వచ్చేసరికి ఇంట్లో వారు ఒప్పుకోవడం లేదని ప్రియుడు చెప్పడంతో మనస్తాపం చెంది న ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పోలీసు స్టేషన్ పరిధి లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పటాన్‌చెరు మండలం లక్డారం గ్రామానికి చెందిన విజయలక్ష్మి కి ఇద్దరు కూతుర్లు. రెండో కూతురు శ్రావణి (21) డిగ్రీ పూర్తిచేసి ఇంటి వద్దనే ఉంటుంది. శ్రావణి అదే గ్రామానికి చెందిన వెంకట్రామిరెడ్డి అలియాస్ విక్కీ ప్రేమించుకున్నారు. శ్రావణి మామ రాజశేఖర్‌రెడ్డి.. వెంకట్రామిరెడ్డితో పెళ్లి గు రించి మాట్లాడగా, శ్రావణి తో పెళ్లికి ఇంట్లో ఒప్పుకోరని చెప్పాడు. దీంతో పెళ్లి చేసుకోకపోతే శ్రావణి వెంటపడొద్దని మందలించడంతో, అప్పటి నుంచి వెంకట్రామిరెడ్డి శ్రావణిని కలవలేదు.
గతేడాది శ్రావణి మామ రాజశేఖర్‌రెడ్డి మృతిచెందడంతో మళ్లీ వెంకట్రామిరెడ్డి శ్రావణిని ప్రేమిస్తున్నానని వెంటపడటం ప్రారంభించాడు. ఇది గమనించిన శ్రావణి తల్లి విజయలక్ష్మి తన కూతురుతో మాట్లాడొద్దని విక్కీని మందలించింది. ఈ క్రమంలో ఈనెల 10న విజయలక్ష్మి పెద్దనాన్న చనిపోవడంతో కుటుంబసభ్యుల తో కలసి వెళ్లారు. ఆదివారం మధ్యాహ్నం శ్రావణి అక్కడి నుంచి ఇంటికి వచ్చేసింది. సాయంత్రం కుటుంబసభ్యులు కార్యక్రమం ముగించుకొని ఇం టికి వచ్చేసరికి శ్రావణి చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుని కనిపించింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రేమించిన వ్యక్తి మోసం చేయడంతోనే తన కూతురు మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుందని విజయలక్ష్మి ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment