ఆమె కోసం అన్నదమ్ముల పచ్చబొట్టు, చివరికి పట్టాల పైకి | In Love With Same Girl, Two Cousins End Lives In Rajasthan | Sakshi
Sakshi News home page

'మా' లవర్‌కి మంచి అబ్బాయితో పెళ్లి చేయండి

Published Tue, Mar 9 2021 10:54 AM | Last Updated on Tue, Mar 9 2021 2:29 PM

In Love With Same Girl, Two Cousins End Lives In Rajasthan - Sakshi

జైపూర్‌: ఇద్దరు అన్మదమ్ములు ఒకే అమ్మాయిని గాఢంగా ప్రేమించారు. ఆమెతోనే జీవితం అనుకున్నారు. ఇంతలో ఏం జరిగిందో తెలియదు కానీ ఇద్దరు యువకులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన రాజస్తాన్‌లోని బుంది జిల్లాలో జరిగింది. వివరాల ప్రకారం..కేశవ్‌పుర గ్రామానికి చెందిన మహేంద్ర గుర్జర్(23), దేవ్‌రాజ్ గుర్జర్(23) వరుసకు అన్నదమ్ములు. అయితే ఒకరికి తెలయకుండా మరొకరు ఒకే అమ్మాయిని ఇష్టపడ్డారు.

ప్రేయసి ఆశా పేరును ఇద్దరు అన్నదమ్ములు పచ్చబొట్టు కూడా వేయించుకున్నారు. ఆ అమ్మాయితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన తర్వాత గానీ తెలియలేదు ఇద్దరూ ప్రేమిస్తుంది ఒకరినే అని. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై రైలు కింద పడి ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు యువకుల మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. 

కాగా ఫోన్ సంభాషణలు, వాట్సప్ మెసేజ్‌ల ఆధారంగా ఇద్దరూ ఆ యువతితో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో సదరు యువతి ఒకరికి తెలియకుండా మరొకరితో లవ్‌ ట్రాక్‌ నడిపిందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఘటన జరిగిన తర్వాత యువతి కనిపించకుండా పోవడం అనుమానాలకు మరింత బలం చేకూరుస్తుంది. అయితే అన్నదమ్ములు ఆత్మహత్య చేసుకునే ముందు తమ చావుకు ఎవరూ కారణం కాదని చెబుతూ ఓ వీడియోను రికార్డ్‌ చేశారు. అంతేకాకుండా తాము ఇద్దరం ప్రేమిస్తున్న యువతికి మంచి అబ్బాయితో పెళ్లి చేయాలని వారి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. తమపై ఎవరి ఒత్తిడి లేదని, వ్యక్తిగత నిర్ణయంతోనే చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు యువకులు వీడియోలో పేర్కొన్నారు. మా చావుకు ఎవరినీ నిందించవద్దని కోరారు. 

చదవండి : (మహిళను చంపి, ముక్కలుగా నరికి.. ఆపై)
(73 ఏళ్ల వృద్ధుడికి పెళ్లి ఆశ చూపించి.. రూ.కోటి టోకరా)


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement