నేను లవ్‌లో ఫెయిలయ్యా: ఐశ్వర్యరాజేష్‌ | I Was Failed In Love Says Aishwarya Rajesh | Sakshi
Sakshi News home page

నేను లవ్‌లో ఫెయిలయ్యా: ఐశ్వర్యరాజేష్‌

Published Mon, Feb 18 2019 7:46 AM | Last Updated on Mon, Feb 18 2019 7:46 AM

I Was Failed In Love Says Aishwarya Rajesh - Sakshi

కొందరు కొంత కాలం ప్రేమించుకుని బ్రేకప్‌ అయిన వెంటనే మరొకరిని ప్రేమిస్తుంటారని...

చెన్నై : ఆ విషయంలో తాను దురదృష్టవంతురాలిని అని అంటోంది నటి ఐశ్వర్యరాజేశ్‌. కోలీవుడ్‌లో అత్యధిక చిత్రాలు చేస్తున్న నటి ఎవరైనా ఉన్నారంటే అది ఈ బ్యూటీనే అవుతుంది. నటిగా ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఎదిగిన కథానాయకి ఈమె. ఈ అచ్చ తెలుగు భామ తమిళంలో ప్రముఖ కథానాయకిగా రాణించడం విశేషమే. ఇటీవలే మాతృభాషలోకి ఎంటర్‌ అయిన ఐశ్యర్యరాజేశ్‌ చిన్న వయసులోనే అన్ని రకాల పాత్రల్లోనూ నటించి మెప్పించి కథానాయకి స్థాయికి ఎదిగింది. ఇటీవల నటించిన కనా చిత్రంలో సెంట్రిక్‌ కథాపాత్రలో నటించి ప్రశంసలు అందుకున్న ఐశ్వర్యరాజేశ్‌ వ్యక్తిగతంగా, ముఖ్యంగా ప్రేమలో ఓడిపోయానని చెప్పింది. అంతే కాదు ఆ విషయంలో తాను దురదృష్టవంతురాలినని పేర్కొంది. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ బ్యూటీ  ప్రేమ, సినిమా, మగాళ్ల గురించి మాట్లాడుతూ తాను ఇప్పటికీ  సింగిల్‌నేనని తెలిపింది.

ప్లస్‌టూ చదువుతున్న రోజుల్లోనే ప్రేమలో పడ్డానని చెప్పింది. అయితే అది మొదట్లోనే ముగిసిపోయిందని అంది. తాను ప్రేమించిన యువకుడిని తన స్నేహితురాలే తన్నుకుపోయి తనను మోసం చేసిందని చెప్పింది. ఆ తరువాత కొన్నేళ్లకు మరోసారి ప్రేమలో పడ్డానని, అప్పుడూ తాము విడిపోవలసిన పరిస్థితి ఏర్పడిందని తెలిపింది. ప్రేమిస్తే అది కలకాలం సాగాలని భావించే అమ్మాయిని తానని అంది. కొందరు కొంత కాలం ప్రేమించుకుని బ్రేకప్‌ అయిన వెంటనే మరొకరిని ప్రేమిస్తుంటారని, అది ఎలా సాధ్యమో తనకు అర్థం కావడం లేదని పేర్కొంది. ఒక నటి ప్రేమించడం అన్నది సులభం కాదని, అయినా ప్రేమించడం ఒక మంచి అనుభవం అని అంది. ప్రస్తుతం తాను సినిమాలపైనే దృష్టి సారిస్తున్నానని అంది. తనకు బందా చేసే కుర్రాళ్లు, పని పాటాలేకుండా తిరిగే వాళ్లు తనకు నచ్చరని ఐశ్వర్యరాజేశ్‌ చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement