తమ డిమాండ్ల సాధనకు సహకరించాలని ప్రభుత్వ జూనియర్ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్ల జేఏసీ నాయకులు ఎంపీ దివాకర్‌రెడ్డిని కోరారు. స్థానిక జేసీ నివాసానికి వెళ్లి ఈ మేరకు సోమవారం ఆయనకు వినతిపత్రం అందజేశారు.
ఎంపీ జేసీ సానుకూలంగా స్పందించి సంబంధిత శాఖా మంత్రితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు. అనంతపురం ఆర్డీఓ కార్యాలయం ఎదుట సమ్మే చేస్తున్న వారికి సంఘీభావం తెలిపేందుకు తప్పక వస్తానని చెప్పారు. జేఏసీ జిల్లా నాయకులు రామాంజనేయులు, నాగరాజు, సూర్యనారాయణ, సుధాకర్, రాజు, నాగరాజునాయక్ పాల్గొన్నారు.