appeals
-
గోండి లిపిని గుర్తించాలి
సాక్షి, హైదరాబాద్: ఆదివాసీ గుంజాల గోండి లిపిని భారత ప్రభుత్వం గుర్తించేలా తగు చర్యలు తీసుకోవాలని ఆద్య కళా మ్యూజియం డైరెక్టర్ ప్రొఫెసర్ జయదీర్ తిరుమలరావు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆయన రాష్ట్రపతి భవన్లో ముర్మును కలిసి తాము సేకరించిన ఆదివాసీ కళాఖండాలను సంరక్షించడంతోపాటు సాహిత్య రంగాల్లో రాణిస్తున్న ఆదివాసులకు తగు గౌరవం కల్పించేలా చొరవ తీసుకోవాలని జయదీర్ రాష్ట్రపతికి కోరారు. -
సీఐసీ వద్ద 19 వేల దరఖాస్తులు పెండింగ్
న్యూఢిల్లీ: కేంద్ర సమాచార హక్కు కమిషన్ (సీఐసీ) వద్ద గత ఏప్రిల్ నాటికి 19,233 దరఖాస్తులు, అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నాయని కేంద్రం బుధవారం లోక్‌సభకు తెలిపింది. పది మంది సభ్యులుండే సీఐసీలో నాలుగు ఖాళీలు ఉన్నాయని కేంద్ర సిబ్బంది వ్యవహారాల సహాయమంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. 2021–22లో 29,213 దరఖాస్తులు, 2020–21లో 35,178 , 2018–19లో 29,655 పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. -
ఐటీ రూల్స్‌లో సవరణలు ఉపసంహరించండి
న్యూఢిల్లీ: ఐటీ నిబంధనల్లో తీసుకొచ్చిన సవరణలను ఉపసంహరించుకోవాలని ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ(ఐఎన్ఎస్) అధ్యక్షుడు కేఆర్పీ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. భాగస్వామ్యపక్షాలతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే సవరణలను ఈ నెల 6న నోటిఫై చేశారని పేర్కొన్నారు. ఏది నిజమో, ఏది నకిలీనో గుర్తించే అధికారాన్ని ఈ సవరణలు ప్రభావితం చేస్తాయని వెల్లడించారు. ఇప్పటిదాకా ఇలాంటి సంపూర్ణ అధికారం ప్రభుత్వానికి, ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏజెన్సీ ఐఎన్ఎస్కు ఉందని గుర్తుచేశారు. మీడియా వృత్తి, విశ్వసనీయతతో ముడిపడి ఉన్న ఏ అంశంపై అయినా నోటిఫికేషన్ జారీ చేసేముందు మీడియా సంస్థలు, విలేకరుల సంఘాలతో విస్తృత, అర్థవంతమైన సంప్రదింపులు జరపాలని ప్రభుత్వాన్ని కోరారు. నిజ నిర్ధారణ కోసం ఎలాంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తారు? న్యాయ సహాయం కోరవచ్చా? అప్పీల్ చేసే హక్కు ఉంటుందా? తదితర కీలక అంశాలను నోటిఫైడ్ రూల్స్‌లో ప్రస్తావించలేదని కేఆర్పీ రెడ్డి తెలిపారు. ఈ ఏడాది జనవరిలో బహిర్గతం చేసిన ముసాయిదా సవరణల కంటే ఈ నెల 6న నోటిఫై చేసిన కొత్త ఐటీ రూల్స్ ఏమాత్రం భిన్నంగా లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. భాగస్వామ్య పక్షాలతో చర్చించకుండా ఐటీ రూల్స్‌లో సవరణలు చేయడం సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘించడమే అవుతుందని ఐఎన్ఎస్ సెక్రెటరీ జనరల్ మేరీ పాల్ స్పష్టం చేశారు. సవరణలు నోటిఫై చేసే ముందు మీడియా సంస్థలతో చర్చల కోసం కేంద్ర సమాచార, ప్రసార శాఖ కనీసం ప్రయత్నం కూడా చేయకపోవడం విచారకరమని పేర్కొన్నారు. -
సీబీఐకి ఇవ్వాలా? వద్దా?
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలకు ఎర కేసులో అప్పీళ్లపై తీర్పును హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం సోమవా రం వెల్లడించనుంది. జన వరి 4న అప్పీళ్లు దాఖలు కాగా, అదే నెల 18 వరకు వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. సిట్ దర్యాప్తును రద్దు చేసి సీబీఐకి బదిలీ చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో అప్పీళ్లు దాఖలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు సిట్ అప్పీల్ పిటిషన్లు దాఖలు చేసింది. బీజేపీతోపాటు నిందితులు దాఖలు చేసిన రిట్ పిటిషన్లో సీఎం కేసీఆర్ వాది, ప్రతివాదిగా లేనప్పుడు ఆయన గురించి తీర్పులో ప్రస్తావించడాన్ని అప్పీల్లో తప్పుపట్టాయి. ఎమ్మెల్యేల కొనుగోలు చేసి ప్రభుత్వా న్ని కూల్చాలని కుట్ర జరిగిందని, అందువల్ల నిందితులకు అనుకూలంగా వచ్చిన సింగిల్‌జడ్జి తీర్పు రద్దు చేయా లని కోరింది. అప్పీళ్లపై ప్రభు త్వం తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే, నిందితుల తరఫున సీనియర్ న్యాయవాదులు డీవీ సీతారాంమూర్తి, రవిచందర్ వాదనలు వినిపించారు. -
Pre-Budget 2023: ఉపాధి కల్పనే ధ్యేయంగా బడ్జెట్..
న్యూఢిల్లీ: వినియోగాన్ని పెంచడానికి ఉపాధి కల్పనే ధ్యేయంగా వచ్చే ఆర్థిక సంవత్సరం (2023–24) బడ్జెట్‌ను రూపొందించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు పారిశ్రామిక రంగం విజ్ఞప్తి చేసింది. వస్తు సేవల పన్ను (జీఎస్టీ), వ్యక్తిగత ఆదాయపు పన్ను శ్లాబ్‌లను హేతుబద్ధీకరించాలని, తద్వారా పన్ను బేస్‌ను విస్తృతం చేసే చర్యలపై బడ్జెట్ దృష్టి పెట్టాలని ఆర్థిక మంత్రితో సోమవారం జరిగిన వర్చువల్ ప్రీ–బడ్జెట్ సమావేశంలో కోరాయి. ఈ సమావేశంలో తమ ప్రతినిధులు చేసిన సూచనలపై పారిశ్రామిక వేదికలు చేసిన ప్రకటనల ముఖ్యాంశాలు.. ప్రైవేటీకరణకు ప్రాధాన్యం: సీఐఐ ‘అంతర్జాతీయ పరిణామాలు కొంతకాలం పాటు అననుకూలంగా కొనసాగే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో దేశీయ డిమాండ్, అన్ని రంగాల పురోగతి, వృద్ధి పెంపునకు చర్యలు అవసరం. ఉపాధి కల్పనను ప్రోత్సహించడం ద్వారా మన దేశీయ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసుకోవాలి. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ దూకుడుపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి మధ్య భారతదేశ ఆర్థిక వ్యవస్థను గాడి తప్పకుండా చూడ్డానికి పెట్టుబడులకు దారితీసే వృద్ధి వ్యూహంపై దృష్టి పెట్టాలి. మూలధన వ్యయాల కేటాయింపుల పెంపునకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఉపాధి కల్పనను పెంచేందుకు ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని ప్రవేశపెట్టాలి. ముఖ్యంగా పట్టణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. వ్యాపారాలకు సంబంధించి పన్ను ఖచ్చితత్వం అవసరం. ఇందుకుగాను కార్పొరేట్ పన్ను రేట్లను ప్రస్తుత స్థాయిలో కొనసాగించాలి. పన్నుల విషయంలో మరింత సరళీకరణ, హేతుబద్ధీకరణ, చెల్లింపులో సౌలభ్యత, వ్యాజ్యాల తగ్గింపు ప్రధాన ప్రాధాన్యతలుగా ఉండాలి’ అని సీఐఐ ప్రెసిడెంట్ సంజీవ్ బజాజ్ పేర్కొన్నారు. పంచముఖ వ్యూహం: పీహెచ్‌డీసీసీఐ ‘కేంద్ర బడ్జెట్ (2023–24) భౌగోళిక–రాజకీయ అనిశ్చితులు, అధిక ద్రవ్యోల్బణం, ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగమనం వంటి కీలకమైన తరుణంలో రూపొందుతోంది. ఈ తరుణంలో స్థిరమైన ఆర్థిక వృద్ధి పథాన్ని కొనసాగించడానికి, దేశీయ వృద్ధి వనరులను పెంపొందించడానికి కీలక చర్యలు అవసరం. ముఖ్యంగా ప్రైవేట్ పెట్టుబడులను పునరుద్ధరించడానికి పంచముఖ వ్యూహాన్ని అవలంభించాలి. వినియోగాన్ని పెంచడం, కర్మాగారాల్లో సామర్థ్య వినియోగాన్ని పెంచడం, ఉద్యోగాల అవకాశాల కల్పన, సామాజిక మౌలిక సదుపాయాల నాణ్యతను మెరుగుపరచడం, భారతదేశ ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం వంటి చర్యలు ఇందులో కీలకమైనవి’అని పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్ సాకేత్ దాల్మియా సూచించారు.æ శుక్రవారం రాష్ట్రాల ఆర్థికమంత్రులతో భేటీ కాగా, ఆర్థికమంత్రి సీతారామన్ వచ్చే శుక్రవారం (25వ తేదీ) రాష్ట్రాల ఆర్థికమంత్రులతో న్యూఢిల్లీలో ప్రీ–బడ్జెట్ సమావేశం నిర్వహించనున్నారు. -
చమురు ఉత్పత్తి పెంచి... యూరప్‌ను ఆదుకోండి
దోహా/ఇస్తాంబుల్: ‘‘చమురు ఉత్పత్తిని మరింతగా పెంచండి. ఇంధనం కోసం రష్యాపై ఆధారపడకుండా యూరప్ దేశాలను ఆదుకోండి. వాటి భవితవ్యం మీ చేతుల్లోనే ఉంది’’ అని ఒపెక్ దేశాలకు, ముఖ్యంగా ఖతర్‌కు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ విజ్ఞప్తి చేశారు. ఖతర్‌లో జరుగుతున్న దోహా ఫోరాన్ని ఉద్దేశించి శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. తమ దేశాన్ని రష్యా సర్వనాశనం చేస్తోందని ఆవేదన వెలిబుచ్చారు. ‘‘మా రేవు పట్టణాలను నేలమట్టం చేసింది. దీంతో ఉక్రెయిన్ ఎగుమతులన్నీ నిలిచిపోయాయి. ఇది ప్రపంచమంతటికీ పెద్ద దెబ్బే. మమ్మల్ని లొంగదీయలేక రష్యా అణు బెదిరింపులకు దిగుతోంది. అదే జరిగితే ప్రపంచమంతటికీ పెనుముప్పే’’ అని హెచ్చరించారు. రష్యా–ఉక్రెయిన్ సంక్షోభానికి చర్చలే పరిష్కారమని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ అన్నారు. జెలెన్స్కీతో ఆయన ఫోన్లో మాట్లాడారు. -
కష్టకాలంలో ఉన్నాం.. విరాళాలివ్వండి: ముఖ్యమంత్రి పిలుపు
సాక్షి ప్రతినిధి, చెన్నై : కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు దాతలు ముందుకు వచ్చి చేయూత ఇవ్వాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పిలుపునిచ్చారు. కరోనా రెండో దశ విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు, సామాజిక సంస్థలు, భారీ పరిశ్రమల యాజమాన్యాలను ఉద్దేశించి సీఎం ఒక ప్రకటన విడుదల చేశారు. కరోనా వైరస్ కారణంగా ప్రజల జీవనా«ధారం దెబ్బతినిందని తెలిపారు. ఆర్థిక వ్యవస్థ కుంటువండిందని పేర్కొన్నారు. సహాయ చర్యల కోసం అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోందని వెల్లడించారు. ఆర్థికంగా పునరుత్తేజం పొందడానికి ప్రభుత్వం అనేక అవకాశాలను అన్వేషిస్తోందని తెలిపారు. ప్రజా బాహుళ్యంలోని సంఘాలు, సంస్థలు తోచిన రీతిలో సహాయం చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి విరివిగా విరాళాలు ఇవ్వాలని కోరారు. విరాళాలు, ఖర్చు వివరాలను వెబ్సెట్లో పొందుపరుస్తామని తెలిపారు. దాతల విరాళాలపై 80 (జీ) కింద వంద శాతం పన్ను మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు. ఎన్ఆర్ఐల నుంచి పొందే విరాళాలపై కూడా పన్ను మినహాయింపు పొందవచ్చని వివరించారు. ఆన్లైన్, బ్యాంకు అకౌంట్ ద్వారా విరాళమిచ్చి రసీదు పొందవచ్చని తెలిపారు. దాత లు తమ విరాళాలను నేరుగా ముఖ్యమంత్రి సహాయ నిధికి మాత్రమే సమరి్పంచాలని పేర్కొన్నారు. రూ.10 లక్షలకు పైగా విరాళం ఇచ్చే దాతలు, సంస్థల పేర్లను వార్తాపత్రికల్లో ప్రచురిస్తామని వెల్లడించారు. ఇచ్చే ప్రతి రూపాయి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కరోనా నివారణ చర్యల కోసం మాత్రమే వినియోగిస్తామని హామీ ఇస్తున్నట్టు తెలిపారు. చదవండి: అన్నాడీఎంకేకు మరో షాక్: చేజారనున్న ‘పెద్దరికం’ చదవండి: కలుపుగోలు సీఎం: స్టాలిన్ కొత్త సంప్రదాయం -
సాయిబాబా అడిగినవి ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: భీమా–కోరెగావ్ ఘటనలో ప్రమే యముందన్న ఆరోపణలపై నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ విశ్వవిద్యాలయం మాజీ అధ్యాపకుడు, 90 శాతం వైకల్యంతో బాధపడుతున్న డాక్టర్.జి.ఎన్. సాయిబాబాకు అవస రమైన మందులు, పుస్తకాలు, ఉత్తరాలు వెంటనే అందజేయాలని జైలు అధికారులకు పౌరహక్కుల నేత, ‘కమిటీ ఫర్ ద డిఫెన్స్, రిలీజ్ ఆఫ్ జీఎన్ సాయిబాబా’ కన్వీనర్ ప్రొ.జి. హరగోపాల్ విజ్ఞప్తి చేశారు. మందులు, లేఖలు, అధ్యయనానికి అవసరమైన మెటీరియల్ ఇవ్వడం వంటి ప్రతీ ఖైదీకి అందాల్సిన మౌలిక హక్కులను కల్పించాలనే డిమాండ్‌తో బుధవారం నుంచి నిరాహార దీక్షకు దిగనున్నట్లు సాయిబాబా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన కోరుతున్న వాటిని అందజేయాలని మంగళవారం ఓ ప్రకటనలో ప్రొ.జి.హరగోపాల్ విన్నవించారు. సాయిబాబా ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోందని, కరోనా సోకే ప్రమాదమూ ఉన్నందున ఆయన్ను అనవసర ఆంక్షలతో వేధించవద్దని కోరారు. ఇప్పటికే కోవిడ్ కారణంగా సాయిబాబాను కుటుంబసభ్యులు, న్యాయవాదులు కలు సుకునే అవకాశం లేకుండా పోయిందన్నారు. అందువల్ల ఆప్తులు, మిత్రుల లేఖలు అందజేయడంతో పాటు, ఆయన కోరిన పుస్తకాలూ ఇవ్వాలని పేర్కొ న్నారు. న్యాయవాది ఇచ్చిన మందులు, పుస్తకాలు కూడా సాయిబాబాకు చేరనివ్వకపోవడం శోచనీయమన్నారు. గతంలో మాతృమూర్తి అంత్యక్రియలకూ అనుమతినివ్వకపోవడం, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ పెరోల్/మెడికల్ బెయిల్ ఇవ్వకపో వడంతో ప్రస్తుతం కరోనా కారణంగా ఆయన ప్రాణానికి ప్రమాదం ఏర్పడిం దన్నారు. ఈ విషయంపై ప్రజాస్వామ్య వాదులు, సంస్థలు స్పందించి నాగ్‌పూర్ జైలు అధికారులకు విజ్ఞప్తులు పంపడం ద్వారా సాయిబాబా హక్కులు కోల్పోకుండా చూడాలని కోరారు. దీనిపై ఇప్పటికే మహారాష్ట్ర అదనపు డైరెక్టర్ జనరల్ (జైళ్లు)కు ఈ నెల 15న సాయిబాబా భార్య వసంతకుమారి వినతిపత్రం పంపించారని హరగోపాల్ తెలిపారు. ఈ విషయంలో వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని సాయిబాబా నిరాహార దీక్షకు దిగకుండా ఆయన అడిగినవి ఇవ్వాలని కోరారు. -
అప్పీళ్ల దాఖలులో మితిమీరిన జాప్యం
న్యూఢిల్లీ: అప్పీళ్లను దాఖలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు మితిమీరిన ఆలస్యం చేస్తున్నారని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయ వ్యవస్థ సమయాన్ని వృథా చేస్తున్నందుకు వారు మూల్యం చెల్లించాల్సి ఉంటుందని, ఆ మేరకు బాధ్యులైన అధికారుల నుంచి ఖర్చులు రాబడతామని హెచ్చరించింది. అప్పీళ్ల విషయంలో నిర్ణీత కాల పరిమితిని పట్టించుకోని ప్రభుత్వాధికారులకు సుప్రీం కోర్టు వేదిక కాదని జస్టిస్ ఎస్.కె.కౌల్, జస్టిస్ దినేశ్ మహేశ్వరిల ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఓ కేసులో అప్పీలు దాఖలు చేసేందుకు మధ్యప్రదేశ్ అధికారులు 663 రోజుల సమయం తీసుకోవడంపై ఈ మేరకు స్పందించింది. ‘ఇలా ఆలస్యం చేసి, ఆ అప్పీల్‌ను కొట్టివేసే పరిస్థితిని తీసుకురావడం, తద్వారా ఈ అంశాన్ని ఇంతటితో మరుగున పడేయటమే ఉద్దేశంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. ‘అంతిమంగా బాధ్యులైన అధికారులు తప్పించుకుంటున్నారు. దీనిపై గతంలో పలు పర్యాయాలు హెచ్చరించినా మార్పు రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి నష్టం వాటిల్లితే, సంబంధిత అధికారులను బాధ్యులుగా చేయాలి’ అని తెలిపింది. అప్పీళ్ల విషయంలో తీవ్ర ఆలస్యానికి కారణం కావడంతోపాటు, న్యాయవ్యవస్థ సమయాన్ని వృథా చేసే అధికారుల నుంచి అందుకు తగ్గ ఖర్చులను వసూలు చేయాలి’ అని తెలిపింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం నుంచి రూ.25 వేలను వసూలు చేయాలని ఆదేశించింది. లేకుంటే ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై ధిక్కార చర్యలు తప్పవని తెలిపింది. -
నిషేధంపై ఉమర్ అక్మల్ అప్పీల్
కరాచీ: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తనపై విధించిన మూడేళ్ల నిషేధాన్ని సవాలు చేస్తూ పాకిస్తాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్ మంగళవారం అప్పీల్ పిటిషన్‌ను దాఖలు చేశాడు. దాంతో పీసీబీ ఈ అంశాన్ని విచారించడానికి స్వతంత్ర హోదా కలిగిన ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. ఈ ప్యానెల్ సభ్యులు మరోసారి ఉమర్æ వాదనలను వింటారు. ఈ ఏడాది జరిగిన పాకిస్తాన్ సూపర్ లీగ్ సందర్భంగా తనను సంప్రదించిన బుకీల సమాచారాన్ని గోప్యంగా ఉంచడంతో ఆగ్రహించిన పీసీబీ ఉమర్‌పై మూడేళ్ల నిషేధాన్ని విధించింది. పాక్ తరఫున గత ఏడాది అక్టోబర్‌లో చివరి మ్యాచ్ ఆడిన ఉమర్ అక్మల్... ఇప్పటి వరకు 16 టెస్టులు, 121 వన్డేలు, 84 టి20ల్లో తన దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. -
రెబెల్స్‌కు బుజ్జగింపులు
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్లో రెబెల్స్ సెగ చల్లారట్లేదు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్వయంగా రంగంలో దిగి వారిని బుజ్జగించే పనిలో పడ్డారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని శుక్రవారం సాయం త్రం తిరిగొచ్చి.. తిరుగుబాటు అభ్యర్థుల సమస్య తీవ్రంగా ఉన్న పురపాలికలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలను శనివారం తెలంగాణ భవన్‌కు పిలుపించుకుని వేర్వేరుగా మాట్లాడారు. పార్టీపరంగా స్థానికంగా ఉన్న సమస్యలేంటి.. రెబెల్స్ సమస్య ఎందు కు ఎక్కువగా ఉందని ఆరా తీశారు. తిరుగుబా టు అభ్యర్థులను వీలైనంత త్వరగా బుజ్జగించి నామినేషన్లు ఉప సంహరించుకునేలా ఒప్పించాలని పార్టీ నేతలను ఆదేశించారు. పోటీ నుంచి వైదొలిగే రెబెల్స్‌కు పార్టీలో గౌర వం, సముచిత స్థానం ఉంటుందని భరోసా కల్పించాలని సూచించారు. పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేసిన వారికి పార్టీలో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, నామినేటెడ్ పదవుల సందర్భంగా ప్రాధాన్యమిస్తామని చెప్పారు. తన మాట కాదని రెబెల్స్ ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేసినా, రెబెల్స్‌తో పోటీ చేయించినా, సహకారం అందించినా భవిష్యత్తులో వారి ముఖం కూడా చూడనని కేటీఆర్ తీవ్రంగా హెచ్చరించినట్లు సమాచారం. టికెట్ల పంపిణీ బాధ్యతల్లో ఉన్న నేతలు ఒక్కో వార్డు వారీగా పరిస్థితిని సమీక్షించి గెలిచే అభ్యర్థులకు మాత్రమే బీ–ఫారాలు ఇవ్వాలని సూచించారు. అభ్యర్థుల ఎంపిక, బీ–ఫారాల అందజేత విషయంలో జాగ్రత్త వహించాలన్నారు. నామినేషన్లు, పార్టీ అభ్యర్థుల సంఖ్య, ఇతర పార్టీల నుంచి పోటీ చేస్తున్న వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆదివారం కూడా కేటీఆర్ తెలంగాణభవన్‌లో ఉదయం 9 గంటల నుంచి మధ్యా హ్నం 2 గంటల వరకు అందుబాటులో ఉం టారని పార్టీ వర్గాలు తెలిపాయి. 14న మ ధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుండగా, రెబెల్స్‌ను పో టీ నుంచి తప్పించేందుకు చివరి నిమిషం వరకు బుజ్జగింపులు కొనసాగే అవకాశాలున్నాయి. ఫిర్యాదుల వెల్లువ.. తమ వ్యతిరేకవర్గం నేతలు రెబెల్స్‌ను ప్రోత్సహిస్తున్నారని ఈ సమావేశంలో పలువురు పార్టీ ఎమ్మెల్యేలు కేటీఆర్ దృష్టికి తెచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని కొల్లాపూర్ మున్సిపాలిటీలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తన అనుచరులతో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున అభ్యర్థులుగా నామినేషన్ వేయించారని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఆలంపూర్ ఎమ్మెల్యే అబ్రహంలు ఫిర్యాదు చేశారు. దీంతో కేటీఆర్ జూపల్లిని పిలిపించి మాట్లాడారు. తన అనుచరులతో నామినేషన్లు ఉపసంహరింపజేయాలని జూపల్లికి సూచించారు. కేటీఆర్‌తో భేటీ అనంతరం జూపల్లి మాట్లాడుతూ.. కొన్ని మనస్పర్థలు రావడం సహజం అంటూనే రెబెల్స్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. మాజీ ఎమ్మెల్యే ఎడమ కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అనుచరులు కల్వకుర్తి మున్సిపాలిటీలో తిరుగుబాటు అభ్యర్థులుగా నామినేషన్లు వేశారని స్థానిక ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ కేటీఆర్‌కు ఫిర్యాదు చేశారు. ఎవరి సత్తా ఎంటో ఎన్నికల్లో తేలిపోతుంది అంటూ కేటీఆర్‌తో సమావేశం అనంతరం జైపాల్‌యాదవ్ వెళ్లిపోయారు. తాండూరు మున్సిపాలిటీ అభ్యర్థుల ఎంపిక విషయంలో మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మధ్య మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రెండ్రోజుల కింద రాజీ కుదిర్చారు. అయినా మహేందర్‌రెడ్డి అనుచరులు నామినేషన్లు వేశారని కేటీఆర్‌కు రోహిత్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. ఇక్కడ 36 వార్డులుంటే టీఆర్ఎస్ నుంచి 139 మంది నామినేషన్లు వేశారని కేటీఆర్‌కు వివరించారు. కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్ల మున్సిపాలిటీలో 30 వార్డులుంటే దాదాపు 20 వార్డుల నుంచి రెబెల్స్ బరిలో దిగారు. రెబెల్స్ అందరినీ కేటీఆర్ పిలిపించి నామినేషన్లు ఉపసంహరించుకోవాలని నచ్చజెప్పారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవిని ఆశిస్తున్న దర్గా దయాకర్‌రెడ్డిని శుక్రవారం కాంగ్రెస్ కండువా కప్పి రేవంత్‌రెడ్డి పార్టీలో చేర్చుకోవడం.. అదే రోజున మంత్రి మల్లారెడ్డి ఆయన్ను బుజ్జగించి తిరిగి టీఆర్ఎస్లోకి తీసుకొచ్చారు. కొత్త ప్రభాకర్‌రెడ్డిని కేటీఆర్ పిలుపుపించుకుని సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ మున్సిపాలిటీ అభ్యర్థుల ఎంపికపై సూచనలు చేశారు. నిజమాబాద్ మున్సిపల్ ఎనిక్నల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం రాజ్యసభ సభ్యు డు డి. శ్రీనివాస్ ప్రయత్నిస్తున్నారన్న సమా చారంతో డీఎస్ వైఖరిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కేటీఆర్ సూచించారు. సిరిసిల్లలో 91% టికెట్లు బీసీలకే.. సమావేశంలో ఒక్కో నేతతో ప్రత్యేకంగా సమావేశమైన కేటీఆర్.. క్షేత్ర స్థాయిలో ప్రచారం, అభ్యర్థుల ఎంపిక, పార్టీ వ్యూహాలపై విస్తృతంగా చర్చించారు. సిరిసిల్ల మున్సిపాలిటీ నుంచి పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఏకంగా 91% బీసీ అభ్యర్థులకు అవకాశం కల్పించారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ప్రచారంపై దృష్టి సారించాలని సూచించారు. పార్టీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ చేసిన మార్గనిర్దేశం ప్రకారం అందరూ పనిచేయాలన్నారు. పురపాలికల్లో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రచారం ఉండాలన్నారు. ప్రతి ఇంటికి టీఆర్ఎస్ ప్రచారం, అభ్యర్థి చేరేలా కార్యచరణ ఉండాలన్నారు. పార్టీ ప్రచార సామాగ్రి చేరవేత వంటి అంశాలపై పార్టీ కేంద్ర కార్యాలయంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. పురపాలికలకు దగ్గర ఉన్న గ్రామీణ ప్రాంతాల పార్టీ నేతల సేవలు వినియోగించుకోవాలన్నారు. పార్టీ ఇన్చార్జులు లేని పురపాలికల్లో పార్టీ నేతల సేవలు అందిస్తామన్నారు. రానున్న 10 రోజులు కష్టపడి పనిచేయాలని, ఎన్నికలను తేలికగా తీసుకోవద్దని కేటీఆర్ హెచ్చరించారు. మంత్రులు నిరంజన్ రెడ్డి, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి, మాలోతు కవిత, ఎమ్మెల్యేలు గణేశ్ గుప్తా, రెడ్యా నాయక్, సంజయ్ కుమార్, కోనేరు కోనప్ప, దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, రవిశంకర్, బొల్లం మల్లయ్య యాదవ్, గ్యాదరి కిశోర్, గొంగిడి సునీత, విట్టల్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, నోముల నర్సింహయ్య, జైపాల్ యాదవ్, క్రాంతి కిరణ్, రవీంద్ర కుమార్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్‌లతో కేటీఆర్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. -
ఎన్నికల షెడ్యూల్ సవరించాలి
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ రిజర్వేషన్లపై అభ్యంతరాలకు కనీసం వారం రోజుల సమయం ఉండేలా ఎన్నికల షెడ్యూల్‌ను సవరించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డికి బీజేపీ ప్రతినిధిబృందం విజ్ఞప్తి చేసింది. ఈ నెల 4, 5 తేదీల్లో మున్సిపాలిటీల్లో రిజర్వేషన్లు ప్రకటించనుండగా, 7వ తేదీనే నోటిఫికేషన్ జారీచేస్తే రిజర్వేషన్లపై అభ్యంతరాలకు సమయం సరిపోదని పేర్కొంది. అనేక మున్సిపాలిటీల్లో వార్డు విభజనల లెక్కల్లో తప్పులు, వార్డులు వారీగా ఓటర్ల జాబితాల్లో, ఎస్సీ,ఎస్టీ,బీసీ జనగణనలో అక్రమాలు చోటుచేసుకున్నాయని తెలిపింది. ఈ మేరకు శుక్రవారం ఎస్ఈసీ కార్యాలయంలో నాగిరెడ్డికి బీజేపీ ఉపాధ్యక్షుడు, మున్సిపల్ ఎన్నికల సమన్వయకర్త డా.ఎస్.మల్లారెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్చందర్జీల ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. ఎస్టీ,ఎస్సీ,బీసీ,మహిళా రిజర్వేషన్ల విషయంలో పారదర్శకత పాటించాలని, నిజాంపేట, బడంగ్‌పేట,పెద్దఅంబర్‌పేట తదితర మున్సిపాలిటీలు,కార్పొరేషన్లలో వార్డులవారీగా ఓటర్ల జాబితాల్లో తప్పులు వెంటనే సరిదిద్దాలని కోరారు. తాము పేర్కొన్న అంశాలపై నాగిరెడ్డి సానుకూలంగా స్పందించారని మల్లారెడ్డి మీడియాకు తెలిపారు. -
ఇంటి నుంచే స్పందన
సాక్షి, రైల్వేకోడూరు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పందన ప్రజల్లో బలమైన నమ్మకాన్ని కలగజేస్తోంది. పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కారం చూపడంతో వారం వారం ఈ కార్యక్రమానికి వెల్లువెత్తుతున్నారు. అర్జీలు చేతబట్టి సోమవారం వేలాదిగా తరలివస్తున్నారు. అధికారులు వారి వినతులు స్వీకరించిఎప్పటిలోగా పరిష్కరించేదీ ఒక రశీదు కూడా ఇస్తున్నారు. ఇది ఎక్కువగా ప్రజలను ఆకర్షిస్తోంది. దీనిపై ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ఒక్క సోమవారమే కాకుండా ఎప్పుడైనా ఇంటి నుంచే నేరుగా ఆన్లైన్లో అర్జీలు సమర్పించే అవకాశం కల్పించింది. ఇందుకోసం ఓ వెబ్‌సైట్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఈ వెబ్సైట్ ముఖ్య ఉద్దేశం.. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వీలుపై జనం హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొద్దిగా కంప్యూటర్ సాంకేతిక పరిజ్ఞానం ఉంటేచాలు అధికారుల చెంతకు వెళ్లి అర్జీలు ఇవ్వాల్సిన అవసరం తప్పుతుంది. ప్రతి సోమవారం ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహించే స్పందన కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తోంది. మండల , జిల్లా, రాష్ట్ర కార్యాలయాలకు వెళ్లి అర్జీలు ఇవ్వాలంటే ప్రజలు ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తోంది. అర్జీ ఇవ్వడానికి కొంత కష్టపడక తప్పడం లేదు. ఇలాంటి వారి ఇబ్బందులు తొలగించేలా ఆన్లైన్లో అర్జీ సమర్పించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. వారంలో అన్నిరోజుల్లోనూ వినతులను ఆన్లైన్లో తెలియజేయవచ్చు. ఇందుకు సంబంధించి సమగ్ర సమాచారం ఆన్లైన్ పోర్టల్‌లో ఉంచింది. జిల్లా, మండల, గ్రామాల వారీగా వివరాలు పేర్కొని సమస్యను నివేదించేలా పోర్టల్‌ను తీర్చిదిద్దారు. ఆన్లైన్లో అర్జీలు నమోదు చేసుకోవడం చాలా సులభం.. ఆన్లైన్ పోర్టల్‌లో అర్జీలను నమోదుచేసుకోవడం సులభం. సమాచారం తెలుగులోనూ ఉంటుంది. స్పందన.ఏపి.జీఓవి.ఇన్ టైప్ చేస్తే స్పందన పోర్టల్ తెరుచుకుంటుంది. దీని గురించి క్షుణంగా తెలుసుకోవాలంటే వాడుక సూచికపై క్లిక్ చేయాలి. ఇందులో 50 పేజీలు ఉన్న పీడీఎఫ్ ఫైల్ తెరుచుకుంటుంది. ఇందులో ప్రతి అంశాన్ని పొందుపరిచారు. ఇలా దరఖాస్తు చేయాలి.. దరఖాస్తు చేయాలంటే ఆన్‌లైన్‌యూజర్ లాగిన్‌పై క్లిక్ చేయాలి. ప్రత్యేకంగా ఒక పేజి తెరపై కనిపిస్తుంది. ఆన్లైన్ సిటిజన్ లాగిన్‌ను క్లిక్ చేయాలి. ఆధార్ సంఖ్య నమోదు చేయమని అడుగుతుంది. తరువాత ఆధార్‌తో అనుసంధానమైన చరవాణికి ఓటీపీ సంఖ్య వస్తుంది. దీనిని నమోదు చేయాలి. తక్షణం స్పందన అర్జీ పేజీ తెరుచుకుంటుంది. ఇందులో మూడు సూచికలు పొందుపరిచారు. మొదటిది యూజర్ ఇన్‌బాక్స్, రెండోది అర్జీ నమోదు, మూడోది అర్జీ నకలు జతచేయడం. యూజర్ ఇన్‌బాక్స్‌ను క్లిక్ చేస్తే గతంలో ఆధార్ సంఖ్యతో అనుసందానమై అర్జీలు ఆన్లైన్లో నమోదుచేసి ఉంటే వివరాలు కనిపిస్తాయి. వాటి ప్రగతి తెలుసుకోవచ్చు. రెండో సూచిక అర్జీ నమోదుపై క్లిక్‌చేస్తే స్పందన దరఖాస్తు తెరపై కనిపిస్తుంది. ఇందులో ఫిర్యాదు చేయాల్సిన ప్రభుత్వ విభాగాన్ని ఎంచుకుని అంశాల వారీగా వివరాలు నమోదు చేయాలి. ఇదే పేజీలో దిగువన టైప్ అన్న చోట ఆన్లైన్ యూజర్ అనే ఆప్షన్ ఎంచుకున్నాక ప్రభుత్వ శాఖల వివరాలు ఎంపిక చేసుకుని దరఖాస్తు అంశాలు నింపే వీలుంటుంది. రిపోర్టులు, ఇతర స్కాన్ ఫైళ్లు కూడా పంపేందుకు అర్జీ నకలు జతచేయండి అనే అంశంపై క్లిక్‌చేసి అప్లోడ్ చేసేలా తీర్చిదిద్దారు. ఈ విధానం ప్రజలకు ఎంతో మేలు చేసేవిదంగా తీర్చిదిద్దారని పలువురు తెలుపుతున్నారు. -
వాళ్లను తిట్టడం ఫ్యాషనైపోయింది.. ఇది సరికాదు!
న్యూఢిల్లీ: కార్పొరేట్లు, పారిశ్రామికవేత్తలను ప్రదాని నరేంద్ర మోదీ మరోసారి సమర్ధించారు. కార్పొరేట్లు వ్యాపారంతో పాటు సామాజిక సేవ చేస్తున్నప్పటికీ.. వారిని తిట్టడం ఫ్యాషన్‌గా మారిందని మోదీ ఆక్షేపించారు. ఇది ఆమోదయోగ్యం కాదన్నారు. ఐటీ నిపుణులు, టెక్నాలజీ దిగ్గజాలతో బుధవారం చర్చాగోష్టిలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఐటీ, కార్పొరేట్ దిగ్గజాలు అత్యుత్తమంగా సామాజిక సేవ చేస్తుండటం, తమ ఉద్యోగులను కూడా ప్రోత్సహిస్తుండటం మనం చూస్తున్నాం. ఎందుకో తెలియదు కానీ మన దేశంలో వ్యాపారవేత్తలను, పారిశ్రామికవేత్తలను విమర్శిస్తుండటం సర్వసాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. ఇదో ఫ్యాషన్‌గా మారింది. ఇది నాకు ఆమోదయోగ్యమైన విషయం కాదు’ అని మోదీ పేర్కొన్నారు. కార్పొరేట్లను మోదీ సమర్ధించడం ఇటీవలి కాలంలో ఇది రెండోసారి. దేశాభివృద్ధిలో పారిశ్రామికవేత్తలు కూడా కీలకపాత్ర పోషించారని, వారితో కలిసి కనిపించడానికి తాను భయపడబోనని జూలైలో ఆయన వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. పన్నులు కట్టడమే కాదు.. సమాజ సేవా చేయాలి.. కేంద్రం ప్రజా ధనాన్ని సద్వినియోగం చేస్తోందన్న నమ్మకం కలగడం వల్లే తమ ప్రభుత్వ హయాంలో పన్నులు సక్రమంగా చెల్లించే వారి సంఖ్య పెరిగిందన్నారు. అయితే, సామాజిక బాధ్యత కింద నిజాయితీగా పన్నులు చెల్లించడంతో పాటు సమాజ శ్రేయస్సు కోసం పౌరు లు తమ వంతుగా మరికాస్త పాటుపడాలని సూచించారు. ‘పన్నులు చెల్లించడమన్నది సహజసిద్ధమైన ప్రకృతి. కట్టకపోవడమన్నది వికృతి. కానీ పన్నులు సక్రమంగా కట్టడంతో పాటు సమాజ శ్రేయస్సు కోసం మరికాస్త పాటుపడటమనేది సంస్కృతి‘ అని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు, దేశం ఎదుర్కొంటున్న సవాళ్లకు టెక్నాలజీపరమైన పరిష్కారమార్గాలు కనుగొనడంపై దృష్టి పెట్టాలని ఐటీ నిపుణులకు ప్రధాని సూచించారు. కాగా కొత్తగా ప్రారంభించిన సెల్ఫ్4సొసైటీకి ఐటీ దిగ్గజ కంపెనీలు మద్దతు తెలిపాయి. -
గాంధీజీ హత్య కేసులో అమికస్ క్యూరీ
న్యూఢిల్లీ: మహాత్మా గాంధీ హత్యకు సంబంధించి పునర్విచారణ జరపాలంటూ అభినవ భారత్ సంస్థ ట్రస్టీ డా.పంకజ్ ఫడ్నీస్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో మాజీ అదనపు సొలిసిటర్ జనరల్ అమరేందర్ శరణ్‌ను అమికస్ క్యూరీగా నియమిస్తున్నట్లు జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఎల్.నాగేశ్వరరావుల ధర్మాసనం తెలిపింది. గాంధీ హత్యకు సంబంధించిన ఆధారాలను ఇప్పుడు ఎలా సేకరిస్తారని పిటిషనర్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. 1949లో గాడ్సేతో పాటు నారాయణ్ ఆప్టేల పిటిషన్లను తూర్పు పంజాబ్ హైకోర్టు తిరస్కరించిన అనంతరం ఈ కేసును సుప్రీం కోర్టు అసలు విచారించనేలేదని, 1966లో ఏర్పాటు చేసిన జేఎల్ కపూర్ కమిషన్ నివేదిక అత్యున్నత ధర్మాసనానికి సమర్పించలేదని ఫడ్నీస్ కోర్టుకు విన్నవించారు. తదుపరి విచారణను కోర్టు అక్టోబర్ 30కి వాయిదా వేసింది. -
జేసీ దివాకర్‌రెడ్డికి కాంట్రాక్ట్ లెక్చరర్ల వినతి
అనంతపురం: తమ డిమాండ్ల సాధనకు సహకరించాలని ప్రభుత్వ జూనియర్ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్ల జేఏసీ నాయకులు ఎంపీ దివాకర్‌రెడ్డిని కోరారు. స్థానిక జేసీ నివాసానికి వెళ్లి ఈ మేరకు సోమవారం ఆయనకు వినతిపత్రం అందజేశారు. ఈ నెల 15న జరిగే కేబినేట్ సబ్ కమిటీ సమావేశం దృష్టికి తమ సమస్యను తీసుకెళ్లి తమ పక్షాన నిలవాలని వారు కోరారు. ఎంపీ జేసీ సానుకూలంగా స్పందించి సంబంధిత శాఖా మంత్రితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు. అనంతపురం ఆర్డీఓ కార్యాలయం ఎదుట సమ్మే చేస్తున్న వారికి సంఘీభావం తెలిపేందుకు తప్పక వస్తానని చెప్పారు. జేఏసీ జిల్లా నాయకులు రామాంజనేయులు, నాగరాజు, సూర్యనారాయణ, సుధాకర్, రాజు, నాగరాజునాయక్ పాల్గొన్నారు. -
అభ్యంతరాలు.. 23వేలు
10వేలకుపైగా వరంగల్ జిల్లాపైనే.. రాష్ట్రంలో జిల్లా 4వ స్థానం జిల్లాల పునర్విభజన ముసాయిదాపై అభ్యంతరాలకు ముగిసిన గడువు కొనసాగుతున్న జిల్లా స్థాయి పరిశీలన ప్రకియ హన్మకొండ అర్బన్ : జిల్లాల పునర్విభజన ముసాయిదాపై జిల్లా నుంచి మొత్తం 23వేల అభ్యంతరాలు అందాయి. వీటిలో ఆన్లైన్ ద్వారా 15వేలకు పైగా రాగా.. మిగతావి కలెక్టరేట్లో అధికారులకు, ప్రత్యేక విభాగంలో నేరుగా అందజేశారు. మొత్తం 23వేల అప్పీళ్లలో వరంగల్ జిల్లాపైనే అత్యధికంగా 10వేలకు పైగా రావడం విశేషం. మొత్తం అప్పీళ్లను అధికారులు ఎప్పటికప్పుడు డౌన్లోడ్ చేసి కలెక్టర్ పరిశీలన అనంతరం మళ్లీ అప్లోడ్ చేస్తున్నారు. ముసాయిదా ప్రకటించిన నాటి నుంచి 30రోజుల గడువు మంగళవారం(20వతేదీ)తో ముగియడంతో అధికారులు కలెక్టరేట్ అప్పీళ్ల స్వీకరణ కార్యక్రమం సాయంత్రం నుంచి ఆపేశారు. అన్లైన్లో మాత్రం అర్ధరాత్రి వరకు అప్లోడ్ అయ్యాయి. అధికారులకు అందిన మొత్తం అప్పీళ్లలో సుమారు 1500 వరకు వివిధ కారణాలతో తిరస్కరించారు. మిగతావి ప్రభుత్వానికి పంపుతున్నారు. కలెక్టరేట్లో అందిన వాటిలో అప్పీళ్లలో కాగితాల సంఖ్య ఎక్కువగా ఉండటంవల్ల పరిశీలన, అప్లోడ్ పనులు కొంత ఆలస్యంగా సాగుతున్నాయి. ప్రక్రియ పూర్తి కావడానికి ఒకటి రెండురోజులు పట్టే అవకాశాలు ఉన్నాయి. ఆన్లైన్ ద్వారా మంగళవారం రాత్రి వరకు అందిన అప్పీళ్ల వివరాలు.. జిల్లా జిల్లాపై డివిజన్‌పై మండలంపై మొత్తం హన్మకొండ 2476 306 373 3155 జయశంకర్ 1093 57 92 1242 మహబూబాబాద్ 154 673 88 915 వరంగల్ 9388 110 865 10363 =========================================== మొత్తం 13111 1146 1418 15675 -
జిల్లాల ఏర్పాటుపై 4,421 అప్పీళ్లు
హన్మకొండ అర్బన్ : కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజ న్లు, మండలాల ఏర్పాటుకు సంబంధించి మంగళవారం రాత్రి వరకు ఆన్లైన్ ద్వారా మొత్తం 4,421 అప్పీళ్లు అందాయి. జిల్లా జిల్లాపై డివిజన్‌పై మండలంపై మొత్తం హన్మకొండ 1700 309 339 2348 జయశంకర్ 745 15 53 813 మహబూబాబాద్ 68 565 67 700 వరంగల్ 413 48 99 560 మొత్తం 2926 937 558 4421 -
జిల్లాల ఏర్పాటుపై 1,424 అప్పీళ్లు
హన్మకొండ అర్బన్ : కొత్త జిల్లాలు, రెవె న్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుకు సంబంధించి ఆదివారం రాత్రి వరకు ఆన్లైన్ ద్వారా మొత్తం 1,424 అప్పీళ్లు అం దాయి. వీటిలో కొత్తగా ఏర్పడబోయే జిల్లాలు, రెవెన్యూ డివిజన్లకు, మండలాలకు సంబంధించిన అభ్యంతరాలు, సూచనలు ఉన్నాయి. కొత్త జిల్లాలకు సంబందించి అప్పీళ్లను పౌరులు నేరుగా, ఆన్లైన్ ద్వారా కూడా ఫైల్ చేయవచ్చు, ఈవిధానం సులభతరంగా ఉండేలా వెబ్సైట్ ఏర్పాటు చేశారు. అభ్యంతరాలు నమోదు కోసం www.newdistrictsformation.telangana.gov.in వెబ్సైట్లోకి లాగినై వివరాలు తెలియజేయాలి. చేతిరాతతో రాసిన కాగితంకానీ, డీటీపీ ద్వారా తయారు చేసిన డాక్యుమెంట్ స్కాన్‌చేసి మీ అభిప్రాయం వెబ్సైట్లో ఆటాచ్ చేసే అవకాశం ఉంటుంది. మీ అప్పీల్ ఫైల్ అయినట్లు మీ సెల్‌కు సమాచారం వస్తుంది. -
పీవోకే విముక్తికి ప్రచారం చేపట్టండి..!
రోఠక్ః పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) విముక్తికోసం భారీ ఎత్తున ప్రచారం చేపట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి.. యోగాగురు రామ్ దేవ్ బాబా విన్నవించారు. ఎన్నికల్లో ఐఎస్ ఐ రిగ్గింగ్ చేసిందని ఆరోపిస్తూ స్థానికుల ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో పీవోకే విముక్తికోసం ప్రయత్నించాలని రామ్ దేవ్ ప్రధానిని కోరారు. పాకిస్తాన్ లాంటి దేశమే కశ్మీర్ ను ఆక్రమించగల్గినప్పుడు గొప్ప దేశమైన భారత్ ఎందుకు చూస్తూ ఊరుకోవాలని బాబా ప్రశ్నించారు. జూలై లో జరిగిన ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటూ పాక్ ఆక్రమిత కశ్మీర్ స్థానికులు ఆందోళనలకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యోగా గురు రామ్ దేవ్ స్పందించారు. పీవోకే విముక్తికోసం ప్రయత్నించేందుకు వెంటనే ప్రచారం చేపట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. కశ్మీర్ ఎలాగైనా తమ సొంతమేననడానికి నవాజ్ షరీఫ్ కు ఎన్నిగుండెలంటూ ప్రశ్నించారు. కశ్మీర్ లోని మన ప్రజలు కేవలం చెప్పుకోడానికేనన్నట్లుందని, పాకిస్తాన్ వారిని ఇప్పటికే ఆక్రమించేంసిందని అన్నారు. గొప్పదేశమైన భారత్ లోని భూభాగాన్ని పాక్ ఆక్రమిస్తుంటే చూస్తూ నెమ్మదిగా ఊరుకునేది లేదన్నారు. పీవోకే ఎలక్షన్లలో రిగ్గింగ్ జరిగిందంటూ ఆగ్రహించిన నీలం వ్యాలీ ప్రాంతంలోని స్థానికులు ఏకంగా పాకిస్తానీ జెండాను సైతం తగులబెట్టి, ఆందోళనలు చేపట్టిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో స్థానికులకు సహకరించి, ఆక్రమిత కశ్మీర్ విముక్తికి ప్రచారం చేపట్టాలని రామ్ దేవ్ బాబా ప్రధానిని కోరారు. -
విషయం అడిగితే విషం చిమ్మడమా?
విశ్లేషణ నెలరోజుల్లో జవాబివ్వండి అని చట్టం ద్వారా ఆదేశించినా వినరు. పోనీ మొదటి అప్పీలు అధికారిగా ఉన్న తమ సీనియర్ అధికారి ఆదేశించినా పాటించకపోతే ఏమిటన్నట్లు? చెత్త ప్రశ్నలు అడుగుతున్నా రంటూ అడిగే వారిని నిందిం చడం అలవాటయింది. కాని చెత్త జవాబులు ఇచ్చే ప్రభుత్వాధికారుల సంగతేమిటి? సమాచార హక్కును దుర్వినియోగం చేస్తున్న మాట నిజమే కానీ జనం కన్నా ఎక్కువగా అధికారులు కూడా ఈ చట్టం ఇచ్చిన అధికారాన్ని సరిగ్గా వినియోగించ కుండా, అడిగిన వాడిని ఏడిపించేందుకు దుర్వినియోగం చేస్తున్నారు. అడగడం హక్కైతే చెప్పడం బాధ్యత. సమాధాన సమాచారాలు ఇవ్వడం జరగకపోతే సమా చార హక్కు చట్టం దుర్వినియోగమైనట్టే. అడిగినవన్నీ ఇవ్వాల్సిందే అని ఎవ్వరూ అనడం లేదు. అమ్మ కూడా అడిగిందంతా పెట్టదు. కానీ ఎందుకు ఇవ్వరో చెప్పడం అనే బాధ్యతను నిర్వర్తించకుండా వదిలేస్తే వారికేమిటి శిక్ష? విషయం చెప్పమని అడిగితే విషం చిమ్మే పరిస్థితు లను ఎందుకు కల్పిస్తారు? ఎవరు బాధ్యులు? అడిగిన సమాచారం ఇవ్వకపోవడమే కాదు, ఇవ్వకుండా ఉండేం దుకు ప్రజలసొమ్మును విరివిగా ఖర్చు చేయడం దుర్మార్గం. ఏ స్పందనా లేకుండా సమాచార అభ్యర్థనను వదిలేసే ప్రభుత్వ సంస్థకు మొదటి అప్పీలు ఆదేశం పాటించడం తప్ప మరో బాధ్యత లేదు. ఆ పనిచేయక పోగా మొదటి అప్పీలులో, రెండో అప్పీలులో కూడా లాయర్లను నియమించి జనం డబ్బు తగలేసి జవాబు ఇవ్వరేమిటి? జాతీయ పర్యావరణ న్యాయస్థానం (ఎన్జీటీ - నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్)కి వచ్చిన కొన్ని సమాచార దరఖాస్తుల ప్రతులు, వాటిపై చర్యల దస్త్రం, తొలి అప్పీళ్లు, మూడో వ్యక్తికి ఇచ్చిన నోటీసుల కాపీలు ఇవ్వా లని ఆర్కె జైన్ కోరారు. నెలరోజుల్లో ఇవ్వలేదు. మొదటి అప్పీలు అధికారి ఆదేశించారు. సమాధానం లేదు. ఈ నిరాకరణ వెనుక దురుద్దేశముందని జైన్ ఆరోపించారు. జరిమానా ఎందుకు విధించకూడదో చెప్పాలని కారణ వివరణ లేఖ జారీ చేశారు. దానికీ జవాబు లేదు. నోటీసు విచారణకు నియమితమైన తేదీ నాడు కూడా రాలేదు. హఠాత్తుగా ఒక లాయర్ గారిని కమిషన్ వద్దకు వెళ్లమని చెప్పారు కానీ ఎందుకు వెళ్లాలో ఏం చేయాలో చెప్పలేదు. సి.పి.ఐ.ఒ. (కేంద్ర ప్రజా సమాచార అధికారి) వారం పైగా సెలవులో ఉంటే ఆ బాధ్యతలను నిర్వహించడానికి మరొకరిని నియమించ కపోవడం మంచి పాలనా? అధికారి ఇచ్చిన వివరణ తప్పుల తడక అని జైన్ వాదించారు. 20 పేజీల సమాచారం ఇవ్వడానికి తనను 40 రూపాయలు అడిగారని, సమాచారం ఇమ్మని ప్రథమ అప్పీలు అధికారి ఆదేశించినా వేల రూపా యలు ఖర్చు చేస్తూ మొదటి రెండో అప్పీళ్లలో లాయర్లను నియ మిస్తూ సమాచారం ఇవ్వకుండా దాట వేస్తున్నారని జైన్ ఆరోపించారు. ఎన్జీటీ ఒక్కొక్క లాయర్‌కు 31 వేల రూపాయల భత్యం, 700 రూపా యల రవాణా ఖర్చు నెలకు ఇస్తూ ప్రతి లాయర్‌కు మొదటి అప్పీలుకు 11 వేలు, రెండో అప్పీలుకు 21 వేలు ఇవ్వాలని ప్రతిపాదిం చిందని వివరించే నోట్‌ను జైన్ మరొక ఆర్టీఐ దరఖాస్తు ద్వారా సంపాదించారు. మొదటి అప్పీలులోనూ, రెండో అప్పీలులోనూ లాయర్‌ను నియమించి తనకు సమాచారం ఇవ్వ కుండా పోరాడుతున్నారని విమర్శించారు. సెక్షన్ 20 ప్రకారం సమంజసమైన కారణం లేకుండా సమాచారం ఇవ్వకపోతే జరిమానా విధించాల్సి ఉంటుంది. కానీ మొదటి అప్పీలు అధికారి ఆదేశాన్ని పాటించనందుకు మరే కారణమూ అవసరం లేకుండానే జరిమానా విధించే వీలుంది. ఆదేశించిన అధికారి సి.పి.ఐ.ఓ. కంటే పై అధికారి. ఆయనకు ఎక్కువ అనుభవం, శాఖాపరమైన పరిచయం ఉంటుంది. ఆయన ఉత్తర్వును పాటించకపోవడం క్రమశిక్షణ అనిపించు కోదు. ఒకవేళ పై అధికారి ఉత్తర్వులో ఏదైనా లోప ముంటే సీపీఐఓ కూడా అప్పీలుకు వెళ్లవచ్చు. లేని పక్షంలో ఆ ఆదేశాన్ని పాటించడం తప్ప మరో మార్గం లేదు. కాని ఆ ఆదేశాల పాలనకోసం పౌరుడు రెండో అప్పీలుకు వెళ్లే పరిస్థితి కల్పించడం అన్యాయం, అస మంజసం. దాన్ని చట్టం ఒప్పుకోదు. ఈ కేసులో మొదటి అప్పీలు అధికారి ఆదేశాన్ని పాటించకపోవడం, వారికి ఇస్తానన్న సమాచారాన్ని అంగీకరించిన తేదీలోగా ఇవ్వకపోవడం, ఆ తరువాత కూడా ఇవ్వకపోవడం వల్ల ప్రజా సమాచార అధికా రిపైన 25 వేల రూపాయల జరిమానా విధించక తప్ప దని కమిషన్ నిర్ణయించింది. చట్ట ప్రకారం ఇవ్వవలసిన సమాచారాన్ని ఇవ్వ కుండా ఏవేవో కుంటిసాకులు చూపుతూ పౌరుడిని అప్పీళ్ల చుట్టూ తిప్పడం సమాచార చట్టాన్ని భంగ పరచడమే అవుతుంది. రెండు అప్పీళ్లలో లాయర్లు హాజరయ్యారు కనుక ఎన్జీటీ కనీసం 32 వేల రూపాయలు ఖర్చు చేసినట్టే భావించాలి. ఇటువంటి వృథా ఖర్చులను ఎందుకు పెడుతున్నారు? ఒక పౌరు డికి చట్ట ప్రకారం ఇవ్వవలసిన సమాచారం ఇవ్వ కుండా ఉండేందుకు ప్రజల ధనాన్ని ఈ విధంగా వెచ్చించవచ్చా? ఇటువంటి నిర్ణయం ఎవరు తీసుకున్నారో పరిశీలించి, ఆ అధికారి బాధ్యుడైతే, అతని నుంచి ఈ కేసుల మీద ఖర్చు చేసిన మొత్తం సొమ్మును ఎన్జీటీ వద్ద డిపాజిట్ చేయించాలని కమిషన్ సూచిం చింది. ఎన్జీటీ అధ్యక్షులు మాజీ సుప్రీంకోర్టు న్యాయ మూర్తి కనుక ఈ అన్యాయ ఖర్చులు నివారించేందుకు ఈ సమస్యను వారి ముందుంచాలని కమిషన్ సూచించింది. (ఇఐఇ/అ/ఇ/2014/000461 జైన్ వర్సెస్ ఎన్జీటీ కేసులో తీర్పు ఆధారంగా) మాడభూషి శ్రీధర్, వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
టోల్ వసూళ్ల పై ఆగ్రహించిన ఆందోళనకారులు
-
సుప్రీంకోర్టుకు బీసీసీఐ
ముంబై:ద్విసభ్య కమిషన్ ఏర్పాటు అనైతికం, చట్ట వ్యతిరేకమని పేర్కొన్న బాంబే హైకోర్టు తీర్పుపై బీసీసీఐ సుప్రీం కోర్టుకు వెళ్లింది. స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) రూపంలో తమ అప్పీల్‌ను దాఖలు చేసింది. బోర్డు అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మెయ్యప్పన్, రాజస్థాన్ రాయల్స్ సహ యజమాని రాజ్ కుంద్రాల బెట్టింగ్ వ్యవహారంపై ఈ కమిషన్ ఏర్పాటైంది. దీన్ని వ్యతిరేకిస్తూ బీహార్ క్రికెట్ అసోసియేషన్ (బీసీఏ) కోర్టులో పిల్ దాఖలు చేయగా బీసీసీఐకి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. ఈనెల2న ఢిల్లీలో జరిగిన ఐపీఎల్ పాలక మండలి సమావేశంలో ఈ తీర్పుపై సుప్రీంకు వెళ్లాలని తీర్మానించారు.