
కరాచీ: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తనపై విధించిన మూడేళ్ల నిషేధాన్ని సవాలు చేస్తూ పాకిస్తాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్ మంగళవారం అప్పీల్ పిటిషన్‌ను దాఖలు చేశాడు. దాంతో పీసీబీ ఈ అంశాన్ని విచారించడానికి స్వతంత్ర హోదా కలిగిన ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. ఈ ప్యానెల్ సభ్యులు మరోసారి ఉమర్æ వాదనలను వింటారు. ఈ ఏడాది జరిగిన పాకిస్తాన్ సూపర్ లీగ్ సందర్భంగా తనను సంప్రదించిన బుకీల సమాచారాన్ని గోప్యంగా ఉంచడంతో ఆగ్రహించిన పీసీబీ ఉమర్‌పై మూడేళ్ల నిషేధాన్ని విధించింది. పాక్ తరఫున గత ఏడాది అక్టోబర్‌లో చివరి మ్యాచ్ ఆడిన ఉమర్ అక్మల్... ఇప్పటి వరకు 16 టెస్టులు, 121 వన్డేలు, 84 టి20ల్లో తన దేశానికి ప్రాతినిధ్యం వహించాడు.