పోలవరం ప్రాజెక్టు నిర్మాణం దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో కృషి చేశారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... వైఎస్ఆర్ హయాంలో ఈ ప్రాజెక్టు కోసం రూ. 4 వేల కోట్లు ఖర్చు చేశారని.. కుడి, ఎడమ కాలువ పనులు 70 శాతం వరకు పూర్తయ్యాయని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అన్ని అనుమతులు సాధించిన ఘనత వైఎస్‌ఆర్‌కే దక్కుతుందన్నారు. ఆయన హఠార్మణం తర్వాత ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురైందని తెలిపారు.