దీక్ష చేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులు
ఎచ్చెర్ల : ప్రభుత్వం దిగి వచ్చేవరకు పోరాటం సాగిస్తామని వర్సిటీ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘ నేతలు స్పష్టం చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్శిటీ కాంట్రాక్టు అధ్యాపకులు చేపడుతున్న రిలే దీక్షలు శుక్రవారం కూడా కొనసాగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణ, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకంలో యూజీసీ నిబంధనల అమలు, స్క్రీనింగ్ పరీక్ష రద్దుపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు అన్యాయం చేస్తే సహించేది లేదని వారు స్పష్టం చేశారు. ఈ దీక్షల్లో డాక్టర్ జేకేఎల్ సుజాత, డాక్టర్ కూన అచ్యుతరావు, రాంజీనాయక్, డాక్టర్ సంధ్యారాణి పాల్గొన్నారు.