ప్రభువా..సీఎంకు మంచి బుద్ధిని ప్రసాదించు..!
– ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్టు లెక్చరర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎంఏ నవీన్‌కుమార్
కల్లూరు (రూరల్): ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంచి బుద్ధిని, ప్రేమగల హృదయాన్ని ప్రసాదించాలని యేసు ప్రభువును రాష్ట్ర ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్టు లెక్చరర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు ఎంఏ నవీన్‌కుమార్ వేడుకున్నారు. కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరించాలంటూ చేపట్టిన సమ్మె 24వ రోజుకు చేరుకుంది. క్రిస్మస్ పండుగ సందర్భంగా సమ్మెలో ఉన్న కాంట్రాక్టు లెక్చరర్లు తమ పిల్లలతో కలిసి క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా నవీన్‌కుమార్ మాట్లాడుతూ.. కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజేషన్ చేసే మంచి బుద్ధిని ముఖ్యమంత్రికి, క్యాబినెట్ మంత్రులకు ఇవ్వాలని యేసు ప్రభును వేడుకున్నామన్నారు. కార్యక్రమంలో మల్లికార్జునస్వామి, లక్ష్మీప్రసాద్‌రెడ్డి, రవి, చాంద్‌బాషా, ఉసేన్‌పీరా, వెంకటకృష్ణ, రంగముంజరి, రుక్మిణి, కల్పన, సరస్వతి పాల్గొన్నారు.