విద్యాశాఖలో అవినీతిని అరికడతాం: కడియం
Published Fri, Mar 17 2017 12:56 PM | Last Updated on Sat, Aug 11 2018 6:42 PM
హైదరాబాద్: రాష్ట్రంలో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల వేతనాలు పెంచే ఆలోచన చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చెప్పారు. తెలంగాణ శాసనమండలిలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ లోని 16 మదర్సాల్లో అవకతవకలు జరిగాయంటూ ఇందుకు సంబంధించి పదిమంది విద్యాశాఖ అధికారులపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. అవకతవకలకు పాల్పడిన వారి నుంచి డబ్బులు రికవరీ చేస్తామని, విచారణ కొనసాగుతోందని చెప్పారు. ఇందులో ఎంతటి వారున్నా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. విద్యాశాఖలో అవినీతిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని, హైదరాబాద్ జిల్లా విద్యాశాఖాధికారిపై విచారణ జరుపుతున్నామని వివరించారు.
Advertisement
Advertisement