పెద్దమనసు చాటుకున్న సీఎం జగన్‌ | CM YS Jagan Respond Contract Lecturers Request Over Salaries | Sakshi
Sakshi News home page

పెద్దమనసు చాటుకున్న సీఎం జగన్‌

Published Sun, Sep 27 2020 8:56 PM | Last Updated on Sun, Sep 27 2020 9:12 PM

CM YS Jagan Respond Contract Lecturers Request Over Salaries - Sakshi

సాక్షి, అమరావతి: గత కొంతకాలంగా జీతాలు లేక ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వ జూనియర్‌, పాలిటెక్నిక్‌, డిగ్రీ కాలేజీల కాంట్రాక్ట్‌ అధ్యాపకుల పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పెద్ద మనసు చాటుకున్నారు. వారికి 12 నెలల జీతం ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. సంబంధిత అధ్యాపకుల వినతి మేరకు 10 నెలల జీతాన్ని 12 నెలలకు పెంచుతూ ఆయన ఆదివారం నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ జూనియర్‌, పాలిటెక్నిక్‌, డిగ్రీ, ప్రైవేట్‌ ఓరియంటల్‌.. ప్రభుత్వ ఓకేషనల్‌ కాలేజీల్లో పనిచేసే కాంట్రాక్ట్‌ అధ్యాపకులకు ఇది వర్తించనుంది. సీఎం నిర్ణయంతో రాష్ట్రంలోని 5,042 మంది కాంట్రాక్టు ఉద్యోగులు లబ్ది పొందనున్నారు. ఈమేరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది.
(చదవండి: అక్టోబర్‌ 1న ఏపీ కేబినెట్‌ సమావేశం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement