ముంబై : కోవిడ్ 19 వైరస్ మహమ్మారి విస్తరణ, దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్ డౌన్ నేపథ్యంలో ఫ్యూచర్స్ మార్కెట్లు కీలక నిర్ణయం తీసుకున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా(ఎంసీఎక్స్), ఇండియన్ కమోడిటీ ఎక్స్ఛేంజ్(ఐఈఎక్స్) ట్రేడింగ్ సమయాన్ని తగ్గిస్తూ ఎంసీఎక్స్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సెబీ చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. తాజా నిర్ణయం ప్రకారం కమోడిటీ ట్రేడింగ్ కేవలం 8 గంటలే జరగనుంది. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు మాత్రమే జరగనుందని ఎంసీఎక్స్, ఐసీఈఎక్స్ సర్క్యులర్‌లో వెల్లడించాయి. ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 14 వరకు ఈ నిర్ణయం అమల్లో వుంటుంది.
తొలి 15 నిమిషాలు జీటీసీ/జీటీడీ చెల్లుబాటు ఆర్డర్స్ రద్దు కోసం ప్రి-ఓపెన్ సెషన్ నిర్వహిస్తారు. అలాగే చివరి 15 నిమిషాలు అంటే రాత్రి 11:30 నుంచి 11:45 వరకు క్లోజింగ్ సెషన్ నిర్వహిస్తారు. ఈ రెండు సెషన్లు కూడా ఉదయం 9 గంటల నుంచి 9:45 నిమిషాల వరకు, సాయంత్రం 4:45 నిమిషాల నుంచి 5గంటల వరకు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 2, ఏప్రిల్ 6, ఏప్రిల్ 14, 2020 న సాయంత్రం సెషన్ (ట్రేడింగ్ సెషన్) అందుబాటులో ఉండదు. ప్రస్తుతం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11:45 గంటల వరకు కమోడిటీ ట్రేడింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment