రూపే డెబిట్ కార్డ్‌లు, యూపీఐ ద్వారా చేసే డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహానికి బడ్జెట్‌లో కేటాయింపులు తగ్గించారు. ఫిబ్రవరిలోని మధ్యంతర బడ్జెట్‌లో ప్రతిపాదించిన రూ.3,500 కోట్లతో పోలిస్తే ఇటీవల ప్రవేశపెట్టిన పూర్తికాల బడ్జెట్‌లో కేటాయింపులను రూ.1,441 కోట్లకు తగ్గిస్తున్నట్లు చెప్పారు.
గత ఏడాది బడ్జెట్‌లో రూపే డెబిట్ కార్డులు, తక్కువ మొత్తంలో జరిగే బీహెచ్‌ఐఎం-యూపీఐ లావాదేవీలను ప్రోత్సహించేందుకు యూనియన్ రూ.2,485 కోట్లును కేటాయించారు. ఫిబ్రవరి, 2024లో విడుదల చేసిన మధ్యంతర బడ్జెట్‌లోనూ ఇందుకోసం రూ.3,500 కోట్లను ప్రతిపాదించారు. కానీ తాజా కేంద్ర పద్దుల లెక్కల్లో మాత్రం ఈ ప్రోత్సాహకాలను రూ.1,441 కోట్లకు తగ్గించారు.
ఇదీ చదవండి: బడ్జెట్ 2024-25.. రియల్టీ ఇన్వెస్టర్లకు చుక్కెదురు..?
బడ్జెట్‌లో కేంద్రం విడుదల చేసే డిజిటల్ పేమెంట్ ప్రోత్సాహక నిధులు ఫిన్‌టెక్, బ్యాంకింగ్ పరిశ్రమపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కొన్ని థర్డ్‌పార్టీ పేమెంట్ యాప్‌లు ఈ విభాగంలో ఆధిపత్యం సాగిస్తున్నాయని ఆర్‌బీఐ హెచ్చరించింది. ఆ సంస్థలు అందించే సేవల్లో ఏదైనా అంతరాయం ఏర్పడినప్పుడు వినియోగదారులు ఇబ్బందులుపడాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. భారతీయ వ్యాపారుల లావాదేవీలు 69 శాతం డిజిటల్ చెల్లింపుల ద్వారానే జరుగుతున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. పాన్ షాపులు, పండ్లు, పూల విక్రయదారులు, ఫుడ్ స్టాల్స్, కిరాణా దుకాణాలు వంటి వీధి వ్యాపారులు కూడా డిజిటల్ పేమెంట్స్ మీద ఆసక్తి చూపుతున్నారు. రాబోయే రోజుల్లో డిజిటల్ లావాదేవీలు మరింత పెరుగుతాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment