ప్రస్తుతం ఏ చిన్న వస్తువు కొనాలన్నా యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా క్యూఆర్ కోడ్ స్కానర్లు దర్శనమిస్తున్నాయి. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం..వంటి థర్డ్‌పార్టీ యూపీఐ యాప్స్‌తో చెల్లింపులు సాగిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో యూపీఐ లావాదేవీలు 36% పెరిగి రూ.60 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఈమేరకు సోమవారం పార్లమెంటులో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వివరాలు వెల్లడించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..‘2024-25లో ఏప్రిల్, జూన్ మధ్య కాలంలో రూ.60 లక్షల కోట్ల విలువైన 4,122 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. అంతకుముందు ఏడాది ఇదే సమయంలో 2,762 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. వాటి విలువ రూ.44 లక్షల కోట్లుగా ఉంది. గతంలో కంటే ఈసారి ఇవి 36 శాతం పెరిగాయి. 2023-24లో మొత్తం 13,113 కోట్ల యూపీఐ లావాదేవీలు చేశారు. వాటి మొత్తం విలువ రూ.200 లక్షల కోట్లు’ అని మంత్రి చెప్పారు.
ఇదీ చదవండి: భారత్‌లో అత్యుత్తమ ర్యాంకు పొందిన సంస్థ
ఆర్థిక సంవత్సరం వారీగా యూపీఐ లావాదేవీల వివరాలు..
2024-25(ఏప్రిల్-జూన్ వరకు) 4,122 కోట్ల లావాదేవీలు రూ.60 లక్షల కోట్లు
2023-24లో 13,113 కోట్లు లావాదేవీలు, రూ.200 లక్షల కోట్లు
2022-23లో 8,371 కోట్ల లావాదేవీలు, రూ.139 లక్షల కోట్లు
2021-22లో 4,596 కోట్ల లావాదేవీలు, రూ.84 లక్షల కోట్లు
Comments
Please login to add a commentAdd a comment