యూపీఐ లైట్ కొత్త ఫీచర్.. ఇదెలా పనిచేస్తుందంటే? | UPI Lite New Feature Auto Top Up | Sakshi
Sakshi News home page

యూపీఐ లైట్ కొత్త ఫీచర్.. ఇదెలా పనిచేస్తుందంటే?

Published Thu, Sep 12 2024 8:27 PM | Last Updated on Thu, Sep 12 2024 8:29 PM

UPI Lite New Feature Auto Top Up

డిజిటల్ ఇండియాలో యూపీఐ పేమెంట్స్ సర్వసాధారణం అయిపోయింది. స్మార్ట్‌ఫోన్‌ వినియోగించే దాదాపు అందరూ గూగుల్ పే, ఫోన్ పే వంటివి ఉపాయ్ప్గిస్తున్నారు. అయితే పేమెంట్స్ చేసేటప్పుడు ఇది కొంత ప్రాసెస్‌తో కూడుకున్న పని. పిన్ ఎంటర్ చేయాలి.. ఆ తరువాత ట్రాన్సక్షన్ జరుగుతుంది.

దీనిని మరింత సులభతరం చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూపీఐ లైట్ ఫీచర్ తీసుకొచ్చింది. దీనిని చిన్న లావాదేవీలకు మాత్రమే ఉపయోగకోవాలి. ఎందుకంటే ఇందులో రూ. 2000 మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఇది పూర్తయిన తరువాత మళ్ళీ యాడ్ చేసుకోవాల్సి ఉండేది. ఇప్పుడు ఈ విధానానికి చరమగీతం పాడే సమయం వచ్చేసింది.

యూపీఐ ఆటో టాప్-అప్
లావేదేవీల కోసం యూపీఐ లైట్ ఉపయోగిస్తుంటే.. అక్టోబర్ 31 తరువాత ఆటో టాప్ అప్ ఎంపికను ఉపయోగించుకోవచ్చు. అంటే యూపీఐ లైట్‌లో ఆటో టాప్-అప్ ఆప్షన్ ఎంచుకుంటే.. అమౌట్ పూర్తయిన తరువాత మీ ప్రమేయం లేకుండానే ఆటోమేటిక్‌గా అమౌంట్ యాడ్ అవుతుంది. ఇది అక్టోబర్ 31 నుంచి అమలులోకి రానున్నట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) వెల్లడించింది.

నిజానికి యూపీఐ ట్రాన్సక్షన్ చేయాలనంటే పిన్ ఎంటర్ చేయాలి. కానీ యూపీఐ లైట్ ద్వారా రూ. 500 కంటే తక్కువ లావాదేవీలు జరపడానికి పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఇది యూజర్ల సమయాన్ని ఆదా చేస్తుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. యూపీఐ లైట్ ద్వారా జరిగే లావాదేవీలు బ్యాంక్ స్టేట్మెంట్‌లో కనిపించవు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement