ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలంటే ఒక యాప్.. ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలనుంటే మరో యాప్, ఇలా ప్రతి ఒక్కదానికీ ఒక్కో యాప్. ఈ విధానానికి ఐఆర్‌సీటీసీ మంగళం పడనుంది. ఇండియన్ రైల్వే 'సూపర్ యాప్' పేరుతో ఓ సరికొత్త యాప్‌ను ప్రారంభించనుంది.
ఐఆర్‌సీటీసీ ప్రారంభించనున్న ఈ సూపర్ యాప్‌ను.. రైల్వేకు సంబంధించిన అన్ని సర్వీసులకు ఉపయోగించుకోవచ్చు. ఇది 2024 డిసెంబర్ చివరి నాటికి అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. ప్రయాణికులకు సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని ఈ యాప్‌ను తీసుకువస్తున్నారు.
ఇండియన్ రైల్వే లాంచ్ చేయనున్న సూపర్ యాప్‌ను సీఆర్ఐఎస్ (సెంటర్ ఫర్ రైల్వే ఇన్‌ఫర్మేషన్ సిస్టం) అభివృద్ధి చేస్తోంది. దీనికి యాప్ టికెట్ బుకింగ్, ప్లాట్‌ఫామ్ పాస్‌లు, ఫుడ్ డెలివరీ వంటి వాటిని అనుసంధానిస్తోంది. అంటే ఈ ఒక్క యాప్‌లోనే టికెట్ బుకింగ్, ఫుడ్ ఆర్డర్, ప్లాట్‌ఫామ్ పాస్ వంటివన్నీ కూడా పొందవచ్చు. అంతే కాకుండా ట్రైన్ జర్నీ స్టేటస్ కూడా ఇందులోనే తెలుసుకోవచ్చని సమాచారం.
ఇండియన్ రైల్వే సూపర్ యాప్ అందుబాటులోకి వచ్చిన తరువాత థర్డ్ పార్టీ యాప్‌ల మీద ఆధారపడే అవసరం ఉండదు. ట్రైన్ జర్నీ చేసేవారు ఎక్కువ యాప్స్ ఉపయోగించాల్సిన అవసరం తీరిపోతుంది. ఇది ప్రయాణాన్ని సులభతరం చేయడం మాత్రమే కాకుండా.. వినియోగదారు అనుభవాన్ని కూడా మెరుగుపరుస్తుందని పలువురు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment