అవసరం ఉన్నప్పుడు డబ్బు కావాలని తెలిసిన వారొస్తే.. అప్పుగా ఇస్తుంటాం. కానీ తిరిగిచ్చేటప్పుడే మనల్ని మనం పాపం అనుకోవాలి. ఎన్నిసార్లు అడిగినా తప్పించుకు తిరుగుతుంటారు. అందరూ అలా ఉంటారని కాదు.. కొందరు ఉంటారు. ఇంట్లో ఉండి కూడా బయటికి వెళ్లారని భార్య, పిల్లలతో చెప్పిస్తుంటారు కదా..! ఇలాంటివి చాలా సినిమాల్లో చూసి ఉంటాం.. మీకూ వ్యక్తిగతంగా అనుభవం అయ్యే ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ బాధలు ఇక ఉండవు. ఇంట్లో ఉండీ లేరని చెప్పించడం ఇకపై కుదరదు. ఎందుకంటే అప్పు తీసుకున్న వారిని ఇట్టే కనిపెట్టొచ్చు. అందుకోసం చైనా ఓ వినూత్నమైన మొబైల్ యాప్‌ను రూపొందించింది. ఈ యాప్ వినియోగదారులకు రుణపడి తప్పించుకుని తిరిగేవారు 500 మీటర్ల లోపు ఎక్కడున్నా మొబైల్‌కు అలర్ట్ వస్తుంది. ఇక వారిని అక్కడికక్కడే కడిగిపారేయొచ్చు. చైనాలోని హెబీ అనే ప్రావిన్స్‌లోని ప్రభుత్వం ఈ యాప్‌ను తయారు చేసింది. ‘అప్పు చేసి తిరిగేవాళ్ల మ్యాప్’అనే క్యాప్షన్‌తో ఈ యాప్‌ను తయారు చేశారు. అయితే ఎంత అప్పు తీసుకున్న వారు కనిపిస్తారనే విషయంలో ఓ క్లారిటీ లేదు.
Comments
Please login to add a commentAdd a comment