ఇప్పుడు ఎక్కడ చూసినా ‘ఆహా’ యాప్ సందడే కనిపిస్తుంది. తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్‌లో సరికొత్త ట్రెండ్‌ని సెట్ చేసింది ఈ యాప్. అల్లు అర్జున్ కూతురు అర్హ పేరు మీద ‘ఆహా’ అనే యాప్‌ను తెరమీదకి తీసుకొచ్చింది అల్లు వారి కుటుంబం. అల్లు అరవింద్, రాము రావ్ జూపల్లి సంయుక్తంగా నిర్మించిన ఈ యాప్‌ను ఇప్పటికే 10 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. తొలి తెలుగు డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాట్‌ఫామ్ గా అరచేతిలొకోచ్చిన ఈ యాప్‌లో తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్‌లకు కేరాఫ్‌గా నిలుస్తూ అదరహో అనిపిస్తుంది.
తెలుగు కొత్త సంవత్సరాది అయిన ఉగాది నాడు (మార్చి 25)న ఆహా యాప్‌ను గ్రాండ్‌గా లాంఛ్ చేయాలని భావించినప్పటికీ కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే ‘సిన్’, ‘లాక్డ్’ అనే కొత్త వెబ్‌సిరీస్‌లను లాంచ్ చేసి ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలో సత్తా చాటుతుంది. కొత్తగా పెళ్లైన జంట మధ్య సాగే కథే ‘సిన్’. శరత్ మారార్ నిర్మించిన ఈ వెబ్‌సిరీస్‌కు నవీన్ మేడారం డైరెక్టర్ గా వ్యవహరించారు. బోల్డ్ కంటెంట్‌తో, డొమెస్టిక్ వయోలెన్స్‌కి వ్యతిరేకంగా ఒక మెసేజ్ ఓరియంటెంట్‌తో తీసిన వెబ్‌సిరీస్ ఇది. ‘మ్యారేజ్ నో ఎక్స్‌క్యూజ్’ అనే క్యాంపెయిన్‌ని నిర్వహిస్తుంది ఈ టీమ్.
దీంతోపాటు ‘లాక్డ్’ అనే మరో వెబ్‌సిరీస్ కూడా తీసుకొచ్చింది. కృష్ణ కులశేఖరన్ నిర్మించిన లాక్డ్ సిరీస్‌లో ప్రముఖ నటుడు సత్యదేవ్ కంచరానా ఓ ముఖ్య పాత్ర పోషించారు. ప్రదీప్ దేవకుమార్ దర్వకత్వం వహించిన ఈ వెబ్‌సిరీస్ థిల్లర్ ఎంటర్‌టైన్‌మెంట్ నేపథ్యంలో సాగుతుంది. ఈ వెబ్‌సిరీస్ ప్రివ్యూ లాంచ్ సందర్భంగా నటీనటులు.. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రతిపాదించిన సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్‌ను చేపట్టి ప్రజల్లో అవగాహన కల్పించారు.
ఫిబ్రవరి 8న విజయ్ దేవరకొండ ఈ యాప్‌ను టెస్ట్ లాంచ్ చేశారు. అర్జున్ సురవరం, ఖైదీ, ప్రెజర్ కుక్కర్, చూసి చూడంగానే, సవారి వంటి డిజిటల్ ప్రీమియర్‌లు ఇప్పటికే ఈ యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు ఆహా సొంతంగా సమర్పించిన వెబ్‌సిరీస్‌లైన మస్తీ, కొత్త పోరడు, షిట్ హాప్పెన్స్, గీతా సుబ్రమణ్యం 2020కి తోడు ఇప్పుడు సిన్, లాక్డ్ అనే రెండు కొత్త వెబ్ సిరీస్‌లు కూడా వచ్చేశాయి.
టెస్ట్ లాంచ్ అయిన అతికొద్ది సమయంలోనే తెలుగువాళ్లందరినీ ఫిదా చేసింది ఈ యాప్. ఓటీటీ విభాగంలో తెలుగులో వచ్చిన తొలి ఏకైక్ యాప్ ఇది. ఓటీటీ అంటే ఓవర్ ద టాప్ అని అర్థం. అంటే కేబుల్, టెలివిజన్, శాటిలైట్ అవసరమేమి లేకుండా నేరుగా మీ మొబైల్‌లోనే నేరుగా సినిమాలు, వెబ్‌సిరీస్‌లను ఆ యాప్‌లో చూడొచ్చు. దేశవ్యాప్త లాక్‌డౌన్ నేపథ్యంలో ఇంట్లోనే ఉండి ఈ యాప్‌తో ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఆస్వాదించండి.
ఆహా యాప్ కోసం ఈ క్రింది లింక్‌ల నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
Playstore: http://bit.ly/2NYmnpA
Appstore: https://apple.co/36wguq5
► Subscribe to us on YouTube: https://www.youtube.com/c/
► Like us on Facebook: https://www.facebook.com/
► Follow us on Twitter: https://twitter.com/AhavideoIN
► Follow us on Instagram: https://www.instagram.com/
Comments
Please login to add a commentAdd a comment