కావాల్సిన వార్తలు ఎంచుకోవడానికి కొత్త యాప్
వాషింగ్టన్: ఆన్‌లైన్‌లో మనకు కావాల్సిన వార్తలను ఎంచుకోవడంలో ఎదురయ్యే ఇబ్బందులను తొలగించి సులభంగా మంచి కథనాలను ఎంచుకోవడానికి వీలుకల్పించే ఓ కొత్త యాప్ అందుబాటులోకి వచ్చింది. ట్రూక్లిక్ అనే పేరుతో ఈ యాప్‌ను ప్యారిస్‌కు చెందిన బృందం రూపొందించింది. మనం చదువుతున్న కథనంలో ఏవైనా అసంబద్ధమైన, అవాస్తవమైన అంశాలుంటే ఈ యాప్ మనను అప్రమత్తం చేస్తుంది.
మనం చదువుతున్న కథనానికి, ఇతర మీడియాలో వచ్చిన అదే అంశానికి తేడాలున్నా ఇది ఎత్తిచూపిస్తుందని పాయింటర్ డాట్ ఆర్గ్ అనే సైట్ పేర్కొంది. ప్రస్తుతం ఇది వార్తలకు మాత్రమే పరిమితమైందని, త్వరలో సామాజిక సైట్లలో అనువైన వీడియోలను ఎంచుకోవడానికి కూడా అందుబాటులోకి రానుందని ఆ సైట్ వెల్లడించింది.