పాలిసెట్–2017 నోటిఫికేషన్ విడుదల
Published Thu, Mar 30 2017 11:34 PM | Last Updated on Tue, Sep 3 2019 8:56 PM
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశ కోసం నిర్వహించే పాలిసెట్–2017 నోటిఫికేషన్ విడుదలైనట్లు కో ఆర్డినేటర్, ఎస్‌జీపీఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ వై. విజయభాస్కర్ గురువారం ఓ ప్రటకనలో తెలిపారు. పదో తరగతి పాస్ అయిన వారు, ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తులను ఏపీ ఆన్‌లైన్, మీసేవ, హెల్ప్‌లైన్ కేంద్రాల నుంచి ఆన్‌లైన్‌లో మాత్ర పూరించాలన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 13 వరకు అవకాశం ఉందన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు పదో తరగతి హాల్ టిక్కెట్, పాస్‌ఫొటో సైజ్ ఫొటో, ఆధార్‌కార్డు, 350 రూపాయల నగదుతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని హాల్ టిక్కెట్‌ను పొందవచ్చన్నారు. ఏప్రిల్ 28న ప్రవేశ పరీక్ష ఉంటుందని, మరిన్ని వివరాలకు తమ కళాశాలలను సంప్రదించాలని సూచించారు. అత్యవసరంగా 9912342055కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని వివరించారు.
Advertisement
Advertisement