విజయవాడ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 2014-15 విద్యాసంవత్సరానికి పారా మెడికల్ (బీఎస్సీ నర్సింగ్-నాలుగేళ్ల, బీఎస్సీ-ఎంఎల్‌టీ, బీపీటీ) కోర్సుల్లో ప్రవేశానికి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు కోరుతూ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 23వ తేదీ ఉదయం 11 గంటల నుంచి అక్టోబర్ 9 సాయంత్రం 5 గంటల వరకు హెచ్‌టీటీపీ://డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. ఎన్టీఆర్‌యూహెచ్‌ఎస్.ఏపీ.ఎన్‌ఐసీ.ఇన్ వెబ్‌సైట్‌లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని వర్సిటీ రిజిస్ట్రార్ టి.బాబూలాల్ తెలిపారు.
అభ్యర్థులు ఆన్‌లైన్‌లో పూర్తిచేసిన దరఖాస్తు ప్రింటౌట్, అటెస్టేషన్ చేసిన ధ్రువపత్రాల జిరాక్సు కాపీలు, ఎస్‌బీఐ చలానాతో అక్టోబర్ 11 సాయంత్రం 5 గంటల లోపు ‘ది కన్వీనర్, అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్స్ కమిటీ-2014, డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, విజయవాడ’ చిరునామాకు అందజేయాలని సూచించారు.
పారా మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు
Published Sat, Sep 20 2014 12:42 AM | Last Updated on Sat, Sep 2 2017 1:39 PM
Advertisement
Advertisement