Para-medical
-
15 వేల అడుగుల ఎత్తు నుంచి.. పోర్టబుల్ ఆస్పత్రి పారా–డ్రాప్
న్యూఢిల్లీ: భారత ఆర్మీ, వైమానిక దళం కలిసి అరుదైన ఘనతను సాధించాయి. పోర్టబుల్ ఆస్పత్రి ‘ఆరోగ్య మైత్రి హెల్త్ క్యూబ్’ను 15 వేల అడుగుల ఎత్తు నుంచి విజయవంతంగా లక్షిత ప్రాంతంలో నేలపైకి దింపాయి. అత్యంత ఎత్తులో నుంచి విజయవంతంగా పూర్తి చేసిన ఈ పారా–డ్రాప్ ప్రాజెక్టు ప్రపంచంలోనే మొట్టమొదటిదని రక్షణ శాఖ తెలిపింది. ఇందులోని క్రిటికల్ ట్రామాకేర్ క్యూబ్‌లను భీష్మ(భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్ హిత అండ్ మైత్రి)ప్రాజెక్టులో భాగంగా దేశీయంగానే రూపొందించినట్లు వెల్లడించింది. మారుమూల, అటవీ కొండ ప్రాంతాల్లో వరదలు వంటి ప్రకృతి విపత్తులు, అత్యవసర సమయాల్లో బాధితులకు అత్యంత వేగంగా, సమర్థమైన వైద్యసేవలను అందించే లక్ష్యంతో ప్రధాని మోదీ ఆదేశాల మేరకు పోర్టబుల్ ఆస్పత్రికి రూపకల్పన జరిగిందని వివరించింది. ఇందులోనున్న వసతులతో 200 మందికి వైద్య సేవలందించొచ్చని తెలిపింది. ఈ క్యూబ్‌ను అధునాతన రవాణా విమానం సీ–130జే సూపర్ హెర్క్యులస్ ద్వారా అనుకున్న చోట అనుకున్న విధంగా నేలపైకి సురక్షితంగా పారాడ్రాప్ చేసినట్లు రక్షణ శాఖ పేర్కొంది. ఆర్మీ ఇందుకోసం అత్యాధునిక ప్రెసిషన్ డ్రాప్ సాంకేతికతను వినియోగించుకుందని తెలిపింది. -
పారా మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి ఆన్లైన్లో దరఖాస్తులు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 2014-15 విద్యాసంవత్సరానికి పారా మెడికల్ (బీఎస్సీ నర్సింగ్-నాలుగేళ్ల, బీఎస్సీ-ఎంఎల్టీ, బీపీటీ) కోర్సుల్లో ప్రవేశానికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు కోరుతూ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 23వ తేదీ ఉదయం 11 గంటల నుంచి అక్టోబర్ 9 సాయంత్రం 5 గంటల వరకు హెచ్‌టీటీపీ://డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. ఎన్టీఆర్యూహెచ్ఎస్.ఏపీ.ఎన్ఐసీ.ఇన్ వెబ్సైట్లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని వర్సిటీ రిజిస్ట్రార్ టి.బాబూలాల్ తెలిపారు. అభ్యర్థులు ఆన్లైన్లో పూర్తిచేసిన దరఖాస్తు ప్రింటౌట్, అటెస్టేషన్ చేసిన ధ్రువపత్రాల జిరాక్సు కాపీలు, ఎస్బీఐ చలానాతో అక్టోబర్ 11 సాయంత్రం 5 గంటల లోపు ‘ది కన్వీనర్, అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్స్ కమిటీ-2014, డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, విజయవాడ’ చిరునామాకు అందజేయాలని సూచించారు.