మైక్రోసాఫ్ట్‌లోనూ ట్రాన్స్‌లేటర్..
సాక్షి, హైదరాబాద్: ఒక భాషను వివిధ రకాల భాషల్లోకి మార్చుకునేందుకు మనం ఎక్కువగా గూగుల్ ట్రాన్స్‌లేటర్‌ను వాడుతుంటాం. ఇకపై మైక్రోసాఫ్ట్‌లో కూడా ఆ సదుపాయం అందుబాటులోకి రానుంది. మైక్రోసాఫ్ట్ ట్రాన్స్‌లేటర్ పేరుతో ఆ సంస్థ సరికొత్త యాప్‌ను విడుదల చేసింది. ఐవోఎస్, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం, ట్యాబ్, స్మార్ట్‌ఫోన్, స్మార్ట్‌వాచీల్లోనూ ఈ లోనూ ఈ యాప్ పనిచేస్తుందని సంస్థ అధికారులు తెలిపారు.
గూగుల్ ట్రాన్స్‌లేటర్ 27 రకాల భాషలు, వాయిస్ కన్వర్జేషన్‌కు మాత్రమే సహకరిస్తుండగా.. మైక్రోసాఫ్ట్ ట్రాన్స్‌లేటర్‌లో 50 రకాల భాషలను అనువదించుకోవచ్చు. అంతేకాకుండా త్వరలో స్కైప్‌కు కూడా ప్రత్యేక ట్రాన్స్‌లేటర్ యాప్‌ను రూపొందించనున్నట్లు సంస్థ వెల్లడించింది. గతంలో మైక్రోసాఫ్ట్ బింగ్ వైబ్‌సైట్ ద్వారా విండోస్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టం, విండోస్ 10 డెస్క్‌టాప్ సాఫ్ట్‌వేర్‌లో ట్రాన్స్‌లేటర్ సదుపాయాన్ని అందుబాటులో ఉంచింది.