శాన్‌ఫ్రాన్సిస్కో : ఫేస్‌బుక్ చెందిన మెసేజింగ్ సర్వీసెస్ వాట్సాప్, ఐప్యాడ్ యూజర్ల కోసం ఓ కొత్త యాప్‌ను లాంచ్ చేసేందుకు సిద్దమవుతుంది. ఈ విషయాన్ని పాపులర్ వాట్సాప్ ఛేంజ్ ట్రాకింగ్ వెబ్‌సైట్ డబ్ల్యూఏబీటాఇన్ఫో ట్వీట్ చేసింది. ఐప్యాడ్ కోసం అప్లికేషన్ రూపొందించేందుకు వాట్సాప్ సిద్దమవుతుందని పేర్కొంది. ''ఐప్యాడ్ డివైజ్ కలిగి ఉన్న వాట్సాప్ యూజర్లకు గ్రేట్ న్యూస్. ఇతర రూమర్లు వాట్సాప్ బిజినెస్, ఫేస్‌బుక్ ఇన్‌ఫ్రాక్ట్ర్చర్ నిజమైన మాదిరి, ఐప్యాడ్ కోసం వాట్సాప్ కొత్త యాప్ కూడా నిజం'' అని డబ్ల్యూబీటాఇన్ఫో ట్వీట్ చేసింది. ఐప్యాడ్ అప్లికేషన్ కోసం వాట్సాప్ డెస్క్‌టాప్ 0.2.6968 యాప్ సంకేతాలను ట్విట్టర్‌లో పోస్టు చేసింది.
అయితే ఇది స్టాండలోన్ అప్లికేషనా? లేదా క్లయింట్ అప్లికేషనా? అనే విషయాన్ని వాట్సాప్ ట్రాకింగ్ వెబ్‌సైట్ రివీల్ చేయలేదు. వాట్సాప్ ఇటీవల కొత్త కొత్త ఫీచర్లను యూజర్ల కోసం ప్రవేశపెడుతోంది. డిలీట్ ఫర్ ఎవ్రీవన్ ఫీచర్‌ను ఇటీవలే వాట్సాప్ కొత్తగా తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా పొరపాటున గ్రూప్‌లో లేదా ఎవరికైనా మెసేజ్ పంపితే 7 నిమిషాల వ్యవధిలో దాన్ని డిలీట్ చేసుకునే వెసులుబాటు ఉంది.
Comments
Please login to add a commentAdd a comment