
అద్భుతమైన ప్రదర్శన, అభినయంతో... భారత సంతతికి చెందిన ఓ అమ్మాయి అభిమానుల గుండెలు హత్తుకునేలా చేసింది. అమెరికన్ ఐడల్ అడిషన్స్‌లో అలైసా రఘునందన్ అనే అమ్మాయి ఇచ్చిన ప్రదర్శన కాంటెస్ట్ జడ్జీలను సైతం వారెవ్వా అనిపించింది. ఆమె ఫర్‌ఫార్మెన్స్‌కు వారు ఫిదా అయిపోయారు. ప్రస్తుతం అలైసా రఘునందన్ ఇచ్చిన ఆడిషన్స్ వీడియో నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.
తన తండ్రి డెన్నిస్ రఘునందన్‌తో కలిసి ఆడిషన్స్‌కు వచ్చిన అలైసా... ప్రోగాంలోని ముగ్గురు జడ్జీలను తన పాటతో మంత్ర ముగ్దుల్ని చేసింది. అంతేకాకుండా అలైసా ప్రదర్శనను చూసిన జడ్జీలు అమెరికన్ ఐడల్‌లో టాప్10లో చోటు కల్పించారు. కూతురు ఆడిషన్స్ పాల్గొనే సమయంలో అక్కడే స్టేజీ బయట వేచిచూస్తున్న తండ్రికి అలైసా గొప్ప కానుకనే అందించింది. తండ్రిపై ఆమెకున్న ప్రేమను స్టేజీపై ఆమె వ్యక్తం చేసిన తీరు అందరిని గుండెలను హత్తుకునేలా చేసింది.