
సాక్షి, అమరావతి: అమెరికాలో కరోనా బారిన పడిన ప్రముఖ జర్నలిస్ట్ కంచిభొట్ల బ్రహ్మానందం మరణించడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కంచిభొట్ల పాత్రికేయునిగా జీవితం ప్రారంభించారు. అనంతరం ఆంగ్ల వార్తా సంస్థ యూఎన్ఐలో పని చేశారు. తర్వాత అక్కడే న్యూయార్క్‌లో స్థిరపడ్డారు. జర్నలిజంలోనే కొనసాగుతూ పేరు ప్రఖ్యాతులు గడించారు.
కొద్ది రోజుల క్రితం అతనికి కరోనా సోకింది. దీంతో అతనికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా.. సోమవారం మృతి చెందినట్లు న్యూయార్క్ వైద్యులు ధ్రువీకరించారు కరోనా బారిన పడి మరణిస్తున్న భారతీయు సంఖ్య పెరగడం అందరినీ కలవరపరుస్తోంది. కాగా న్యూయార్క్‌తోపాటు న్యూజెర్సీలో వైరస్ తీవ్రత అధికంగా ఉంది. కేవలం ఈ రెండు రాష్ట్రాల్లోనే ఇప్పటివరకు లక్షా 70 వేల మంది కరోనా బారిన పడ్డారు. దీని బారిన పడి అమెరికాలో ఇప్పటివరకు పదివేల మందికి పైగా మరణించగా, ఒక్క న్యూయార్క్‌లోనే 4,758 మంది ప్రాణాలు విడిచారు. (వారికి సాయం అందించండి : సీఎం జగన్)
Comments
Please login to add a commentAdd a comment