లండన్: వింబుల్డన్ 2021లో ఇండో అమెరికన్ సమీర్ బెనర్జీ సంచలనం సృష్టించాడు. ఆల్ ఇంగ్లండ్ క్లబ్‌లో జరిగిన ఈ పోటీల్లో బాలుర విభాగంలో పోటీ పడ్డ సమీర్ బెనర్జీ (17) తుదిపోరులో అమెరికాకు చెందిన విక్టర్ లిలోవ్‌పై 7-5, 6-3 తేడాతో విజయం సాధించాడు. జూనియర్ గ్రాండ్‌స్లామ్‌లో పోటీ పడ్డ రెండోసారే సమీర్.. ఈ ఘనత సాధించాడు. అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగి విశేషంగా ఆకట్టుకుంటూ టైటిల్‌ను కైవసం చేసుకున్న సమీర్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. రానున్న కాలంలో పురుషుల టెన్నిస్‌ను ఏలుతాడంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్ల వర్షం కురుస్తోంది.
కాగా, భారత్‌కు చెందిన యూకీ బాంబ్రీ జూనియర్ విభాగంలో చివరిసారిగా 2009 ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్‌ను గెలిచాడు. అంతకుముందు లియాండర్ పేస్ (1990 వింబుల్డన్), రమేష్ కృష్ణన్ (1979 ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్), రామనాథన్ కృష్ణన్ (1954 వింబుల్డన్) జూనియర్ విభాగంలో గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను చేజిక్కించుకున్నారు.A future men's champion?
— Wimbledon (@Wimbledon) July 11, 2021
Samir Banerjee might well be a name you become more familiar with in the future#Wimbledon pic.twitter.com/byAEBwBrSp
Comments
Please login to add a commentAdd a comment