
సాక్షి, సిటీబ్యూరో: ప్రముఖ ప్రైవేటు వినోద చానెల్ జీ తెలుగు కరోనాపై పోరాటంలో దేశవాసుల ఐక్య స్ఫూర్తిని ప్రేరేపించేలా ‘ఏక్ దేశ్ ఏక్ రాగ్’ పేరిట ఒక వినూత్న సంగీత కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ విషయాన్ని సంస్థ నగర ప్రతినిధులు తెలిపారు. జీ సరిగమపలో భాగంగా 25 గంటల ఈ మ్యూజికల్ లైవ్–థాన్‌ను శనివారం నిర్వహించనున్నామన్నారు. కోవిడ్‌పై పోరులో ప్రజల్ని ఐక్యం చేసేందుకు సంగీతాన్ని ఒక మార్గంగా ఎంచుకున్నామన్నారు. ఇది పూర్తిగా డిజిటల్ కన్సర్ట్‌గా సాగుతుందని, దేశవ్యాప్తంగా పేరొందిన గాయకులు తమ తమ ఇళ్ల నుంచే జీ ఫేస్‌బుక్ పేజెస్ ద్వారా 350 రకాల ప్రదర్శనలు ఇస్తారని వారు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment