స్టైలిష్‌గా సామ్‌.. తన వాచ్‌ ధర ఎన్ని లక్షలో తెలుసా? | Samantha Bvlgari Serpenti Watch Cost Details, Photo Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

Samantha: సమంత ధరించిన చేతి వాచ్‌ అన్ని రూ.లక్షలా?

Published Sun, Sep 29 2024 7:29 PM | Last Updated on Mon, Sep 30 2024 12:20 PM

Samantha Bulgari Watch Cost Details

చాలాకాలం తర్వాత సమంత మళ్లీ హడావుడి మొదలుపెట్టేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో వరుస ఫోటోషూట్స్‌ షేర్‌ చేస్తోంది. తను నటించిన సిటాడెల్‌: హనీ బన్నీ వెబ్‌ సిరీస్‌ను లండన్‌లో ప్రీమియర్‌ ప్రదర్శించడమే ఇందుకు కారణం! లండన్‌లో జరిగిన వెబ్‌ సిరీస్‌ ప్రీమియర్‌కు సిటాడెల్‌ ఒరిజినల్‌ వర్షన్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రాతో పాటు సమంత సైతం హాజరైంది.

వాచ్‌ ధర..
ఈ సందర్భంగా ఆమె చేతికి ధరించిన వాచ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తన స్టైలిష్‌ లుక్‌ను రెట్టింపు చేసేలా ఉన్న ఈ వాచ్‌ ధర తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం. లగ్జరీ బ్రాండ్‌ బల్గరీకి చెందిన ఈ వాచ్‌ ధర రూ.45.5 లక్షలని తెలుస్తోంది. ఇది విన్న అభిమానులు ముక్కున వేలేసుకుంటున్నారు.

వెబ్‌ సిరీస్‌..
సమంత సినిమాల విషయానికి వస్తే.. ఆమె ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్‌ సిరీస్‌ 'సిటాడెల్‌: హనీ బన్నీ' నవంబర్‌ 7 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ కానుంది. వరుణ్‌ ధావన్‌ ప్రధాన పాత్ర పోషించిన ఈ సిరీస్‌కు రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వం వహించారు. అలాగే సామ్‌ 'మా ఇంటి బంగారం' అనే సినిమాను నిర్మిస్తోంది.

 

 

చదవండి: జయం రవితో అలాంటి రిలేషన్‌ లేదు'.. సింగర్ క్లారిటీ!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement