Oscar 2023: Do You Know RRR Star Jr NTR Watch Cost - Sakshi
Sakshi News home page

Jr NTR: ఆస్కార్‌ ప్రమోషన్స్‌లో యంగ్‌ టైగర్‌ ధరించిన వాచీ ధర ఎంతో తెలుసా?

Published Thu, Mar 16 2023 8:52 AM | Last Updated on Thu, Mar 16 2023 9:14 AM

RRR Star Jr NTR Wear Branded Watch, Cost Details Will Surprise You - Sakshi

ఆర్‌ఆర్‌ఆర్‌తో ప్రపంచస్థాయిలో సత్తా చాటారు జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, రాజమౌళి, కీరవాణి. ఆస్కార్‌ రావడం కోసం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ, షోలలో పాల్గొంటూ ఎంతో కష్టపడ్డారు. ఎట్టకేలకు అనుకున్నది సాధించి ఆస్కార్‌ను పట్టేశారు. బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో నాటు నాటు పాటకు ఆస్కార్‌ లభించింది. ఇక లాస్‌ ఏంజిల్స్‌లో ప్రమోషన్లలో అల్ట్రా స్టైలిష్‌ లుక్‌లో కనిపించాడు తారక్‌. ఆ సమయంలో తారక్‌ చేతికి ధరించిన వాచీపై అందరి దృష్టి పడింది. తారక్‌కు వాచెస్‌ అంటే ఎంతిష్టమో తెలిసిందే! ఎప్పటికప్పుడు కొత్త వాచీతో దర్శనమిస్తాడు హీరో. లేటెస్ట్‌గా మరో కొత్త వాచీతో కనిపించడంతో అభిమానులు దాని గురించి ఆరా తీస్తున్నారు.

జూనియర్‌ ఎన్టీఆర్‌ పెట్టుకున్న చేతి గడియారం పటేక్‌ ఫిలిప్‌ బ్రాండెడ్‌కు చెందినది. దీని ధర కోటిన్నర నుంచి రెండు కోట్ల రూపాయల మధ్య ఉంటుందని తెలుస్తోంది. ఇది స్విట్జర్లాండ్‌కు చెందిన కంపెనీ కాగా దీనికి వంద ఏళ్ల చరిత్ర ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే గతంలో మీడియా సమావేశానికి హాజరైనప్పుడు నాలుగు కోట్ల రూపాయల విలువైన రిచర్డ్‌ మిల్లీ బ్రాండ్‌కు చెందిన వాచీ ధరించి అందరినీ ఆశ్చర్యపరిచాడు యంగ్‌ టైగర్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement