
ఆర్‌ఆర్‌ఆర్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోంది చిత్రయూనిట్. తాజాగా ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్ల వసూళ్లను సాధించడంతో ముంబైలో సక్సెస్ పార్టీ నిర్వహించారు మేకర్స్. ఈ ఫంక్షన్‌కు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్‌చరణ్‌తో సహా బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం హాజరయ్యారు. అయితే ఈ వేడుక కోసం ముంబై వెళ్లిన ఎన్టీఆర్ చేతికి పెట్టుకున్న వాచ్ కెమెరాల కంటపడింది.
ఇంకేముందీ, ఎన్టీఆర్ చేతికి పర్ఫెక్ట్‌గా సెట్టయ్యిన ఆ వాచ్ గురించి సెర్చింగ్ మొదలుపెట్టగా దాని ధర కోటిన్నర పైనే ఉందని తెలుస్తోంది. ఆ వాచ్ పేరు Patek Philippe Nautilus 5712 1/A. మీకీపాటికే అర్థమై ఉంటుంది ఇది విదేశాలకు చెందిన బ్రాండెడ్ వాచ్ అని! వాచీలంటే మక్కువ చూపే ఎన్టీఆర్ దీన్ని సొంతం చేసుకునేందుకు కోటి 70 లక్షల పైనే ఖర్చు చేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ బ్రాండ్‌లో లభించే ప్రతి వాచ్ కూడా చాలా ఖరీదైనదే!
కాగా గతేడాది ఆర్‌ఆర్‌ఆర్ ప్రమోషన్స్‌లోనూ తారక్ ఖరీదైన వాచ్ ధరించాడు. రిచర్డ్ మిల్లే RM కు చెందిన 011 కార్బన్ NTPT గ్రోస్జీన్ అనే బ్రాండెడ్ వాచ్‌తో కనిపించాడు. దీని ధర దాదాపు నాలుగు కోట్ల రూపాయలు. ఇలా ఎన్టీఆర్ దగ్గర బ్రాండెడ్ వాచ్‌లు మరికొన్ని ఉన్నాయట!
చదవండి: విజయ్‌పై షారుక్ ఆసక్తికర వ్యాఖ్యలు, దళపతి ఫ్యాన్స్ ఏమంటున్నారంటే..
Comments
Please login to add a commentAdd a comment