కాపురాలను కూల్చేస్తున్న నీలిచిత్రాలు | Watching porn may lead to divorce: Study | Sakshi

కాపురాలను కూల్చేస్తున్న నీలిచిత్రాలు

May 11 2014 1:14 PM | Updated on Sep 18 2018 7:52 PM

కాపురాలను కూల్చేస్తున్న నీలిచిత్రాలు - Sakshi

కాపురాలను కూల్చేస్తున్న నీలిచిత్రాలు

నీలి చిత్రాలు చూసే అలవాటు ఉన్నవారు వెంటనే ఆ అలవాటును మానుకోవడం మంచిదని, లేకుంటే కాపురం కూలిపోయే ప్రమాదముందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

న్యూయార్క్: నీలి చిత్రాలు చూసే అలవాటు ఉన్నవారు వెంటనే ఆ అలవాటును మానుకోవడం మంచిదని, లేకుంటే కాపురం కూలిపోయే ప్రమాదముందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. నీలి చిత్రాలు చూసే వారి వివాహ బంధం విచ్చిన్నమై విడాకులకు దారితీస్తున్నాయని ఓ పరిశోధనలో తేలింది.

నీలి చిత్రాలు చూసే అలవాటు వివాహేతర సంబంధాలకు ప్రేరేపిస్తోందని వెల్లడైంది. ఇటువంటి చిత్రాలు చూసే ఆడ/మగవారిలో చాలామంది వివాహేతర సంబంధాలు కోరుకుంటున్నారని చెబుతున్నారు. ఇలాంటి భార్యభర్తల మధ్య గొడవలు వచ్చి చివరకు విడాకులు తీసుకుంటున్నారని వెల్లడించారు. 551 మంది దంపతులపై పరిశోధన చేశారు. నీలి చిత్రాలు చూశారా? వివాహ భాగస్వామితో గాక ఇతరులతో శృంగారంలో పాల్గొనడంపై మీ అభిప్రాయం ఏమిటి? నీలి చిత్రాలు చూసే అలవాటు వివాహేతర సంబంధాలకు ప్రేరేపిస్తుందా? వంటి ప్రశ్నలకు వారి అభిప్రాయం సేకరించారు. నీలి చిత్రాలు చూసే వారి వివాహితుల కాపురాలు ఎక్కువగా విచ్చిన్నమైనట్టు పరిశోధనలో తేలింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement