
వాచీ ఎట్ 330 కోట్లు
రకరకాల రంగుల వజ్రాలు పొదిగిన ఈ మనోహరమైన వాచీ ధర వింటే వామ్మో అంత రేటా అని ఖచ్చితంగా అంటారు. ఈ వజ్రాల వాచీ ధర అక్షరాలా రూ.330 కోట్లు. బ్రిటన్‌కు చెందిన గ్రాఫ్ అనే ఆభరణాల సంస్థ వందల కోట్లు విలువచేసే 110 క్యారెట్ల బరువైన వజ్రాలతో దీన్ని రూపొందించింది. గురువారం నుంచి స్విట్జర్లాండ్ దేశంలోని బాసెల్ నగరంలో జరుగుతున్న ‘బాసెల్‌వరల్డ్ 2014’ ఎగ్జిబిషన్‌లో దీనిని ప్రదర్శనకు ఉంచారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ వాచీని చూసేందుకు సందర్శకులు బారులుతీరారు. ఇంతటి విలువైన వాచీని ఎవరికీ విక్రయించబోమని తయారీ సంస్థ తేల్చిచెప్పింది.