
సెలబ్రిటీలకు సంబంధించిన ప్రతీ విషయాన్ని తెలుసుకునేందుకు అభిమానులు ఉత్సాహం చూపిస్తుంటారు. తాజాగా రాజమౌళి కుమారుడి పెళ్లి సందర్భంగా టాలీవుడ్ అంతా రాజస్థాన్ చేరుకుంది. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్ట్‌లో ఎన్టీఆర్ లుక్ చూసిన కొంత మంది షాక్ అయ్యారు. ఆ సమయంలో ఎన్టీఆర్ చేతికి ఉన్న గడియారం ధర తెలుసుకొని అవాక్కవుతున్నారు.
ఆ వాచ్ ధర రెండు కోట్లకు పై మాటే అంటూ సోషల్ మీడియాలో స్క్రీన్ షాట్స్‌ను కూడా పోస్ట్ చేస్తున్నారు. ఎఫ్ రేస్‌లో పాల్గొనే వారు ధరించే అత్యంత ఖరీదైన రిచర్డ్ మిల్లే మెక్‌లారెన్ కంపెనీ వాచ్ అన్న టాక్ వినిపిస్తోంది. ఈ వార్తలపై సోషల్ మీడియాలో జోక్‌లు కూడా పేలుతున్నాయి. ఆ వాచ్ ఖరీదు కొంత మంది హీరోల సినిమాల బడ్జెట్ అంత ఉందంటూ కొందరు.. కొందరు స్టార్ హీరోల సీడెడ్ కలెక్షన్ అంత ఉందంటూ మరికొందరు ట్వీట్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment