Ambrane FitShot Surge Smartwatch Launched in India - Sakshi
Sakshi News home page

ఆంబ్రేన్‌ నుంచి సరికొత్త స్మార్ట్‌వాచ్.. అదిరిపోయే ఫీచర్స్‌ ఇవే!

Published Wed, Mar 23 2022 6:54 PM | Last Updated on Wed, Mar 23 2022 7:51 PM

Ambrane FitShot Surge Smartwatch Launched in India - Sakshi

ప్రస్తుతం మార్కెట్లోకి రకరకాల స్మార్ట్‌ వాచ్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ వాచ్‌లలో రకరకాల ఫీచర్స్‌ను జోడిస్తూ ముందుకు వస్తున్నాయి కంపెనీలు. ఇక స్మార్ట్‌ఫోన్‌ యాక్సెసరీ బ్రాండ్‌ ఆంబ్రేన్‌ "ఫిట్‌షాట్ సర్జ్" పేరుతో సరికొత్త స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసింది. దీని ధర రూ.1,999గా నిర్ణయించింది. ఈ వాచ్‌ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉండనుంది. ఈ స్మార్ట్‌ వాచ్‌ ఒక సంవత్సరం పాటు వారంటీతో వస్తుంది. ఫిట్‌షాట్ సర్జ్'ను ప్రీమియం రస్ట్ ప్రూఫ్ జింక్ అల్లాయ్ బాడీ, తేలికపాటి డిజైన్'తో తయారు చేశారు. ఇందులో ఐపీ68 రేటెడ్ డస్ట్​, వాటర్​ రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది.

ఈ స్మార్ట్‌వాచ్‌ రోజ్ పింక్. జేడ్ బ్లాక్ రంగులలో అందుబాటులో ఉంది. ఆంబ్రేన్‌ ఫిట్‌షాట్ సర్జ్ స్మార్ట్‌వాచ్‌ 1.28 అంగుళాల డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌వాచ్‌ 24×7 రియల్‌ టైమ్‌ హెల్త్‌ ట్రాకింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్‌ సహాయంతో Spo2, రక్తపోటు, క్యాలరీలు, స్లీప్, పెడోమీటర్, బ్రీత్ ట్రైనింగ్, స్ట్రెస్ మానిటరింగ్ వంటి పారామీటర్లను చూసుకోవచ్చు. స్టెప్‌ ట్రాకర్‌ కూడా ఉంటుంది. ఎన్ని కాలరీలను ఖర్చు చేశామనే వివరాలు ఇందులో తెలుస్తుంది. స్మార్ట్ నోటిఫికేషన్‌లు, 8 ట్రైనింగ్ మోడ్‌లు, టైమర్, అలారం, స్టాప్‌వాచ్, వాతావరణం, సెడెంటరీ రిమైండర్ వంటి మరెన్నో ఇతర ఫీచర్స్ ఉన్నాయి. ఫిజికల్‌ యాక్టివిటీ హిస్టరీని రికార్డు చేయవచ్చు. యూజర్లు వారి స్మార్ట్​ఫోన్​లో అంబ్రేన్​ యాప్​ డౌన్‌లోడ్ చేసుకొని ఎప్పటికప్పుడు హెల్త్​ హిస్టరీని ట్రాక్​చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌వాచ్ వాయిస్- అసిస్టెన్స్​ ఫీచర్​తో వస్తుంది. ఇందులో బ్లూటూత్‌ కాలింగ్‌ ఫీచర్‌ కూడా ఉంది. బ్లూటూత్‌ ద్వారా ఫోన్‌ను కనెక్ట్‌ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. 7 రోజుల బ్యాటరీ లైఫ్ వస్తుంది.

(చదవండి: దేశంలో తగ్గని స్టార్టప్ కంపెనీల జోరు..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement