అతి చవకధరలో స్మార్ట్‌వాచ్‌ | Ambrane launches affordable smartwatch at Rs 1,999 | Sakshi
Sakshi News home page

అతి చవకధరలో స్మార్ట్‌వాచ్‌

Published Mon, Sep 11 2017 2:01 PM | Last Updated on Tue, Sep 19 2017 4:22 PM

Ambrane launches affordable smartwatch at Rs 1,999



సాక్షి, న్యూఢిల్లీ:
దేశీయ కంప్యూటర్ ఉపకరణాల సంస్థ అంబ్రేన్  చవక ధరలో స్మార్ట్‌ వాచ్‌ ను లాంచ్‌ చేసింది.  ఏఎస్‌ డబ్ల్యు-11పేరుతో దీన్ని సోమవారం విడుదల చేసింది.  దీని ధరను కేవలం రూ.1,999 కే ప్రారంభించింది. ఈ  స్మార్ట్ వాచ్  ఫిట్నెస్ ట్రాకర్ గా పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది.

తమ స్మార్ట్‌ వాచ్‌ ద్వారా వినియోగదారులు రోజువారీ ఫిట్నెస్ కార్యకలాపాలను ట్రాక్ చేయొచ్చనీ,  అలాగే  పెడోమీటర్‌ సహాయంతో నడకదూరాన్ని , స్లీప్‌ పాటర్నీ కూడా పరిశీలిస్తుందని  కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.  చాలా ఖరీదైన వాచ్‌లను ఇది రీప్లేస్‌ చేస్తుందనీ, అలాగే  ఫిట్నెస్ ట్రాకర్ పాత్రను కూడా  పోషిస్తుందని  అంబ్రేన్ ఇండియా డైరెక్టర్ గౌరవ్ దూరెజా తెలిపారు.  బ్లాక్‌ కలర్‌లో అందుబాటులో ఉన్న  ఈ స్మార్ట్‌వాచ్‌ ఒక సంవత్సరం వారెంటీతో  అన్ని ప్రముఖ రిటైల్, ఇ-టెయిల్ స్టోర్లలో  లభిస్తుందని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement