బడ్జెట్ ధరలో ఇంటెక్స్ కొత్త స్మార్ట్ ఫోన్ | Intex launches affordable smartphone 'Cloud Q11' at Rs 4,699 | Sakshi
Sakshi News home page

బడ్జెట్ ధరలో ఇంటెక్స్ కొత్త స్మార్ట్ ఫోన్

Published Tue, Sep 27 2016 3:23 PM | Last Updated on Mon, Sep 4 2017 3:14 PM

బడ్జెట్ ధరలో ఇంటెక్స్ కొత్త స్మార్ట్ ఫోన్

బడ్జెట్ ధరలో ఇంటెక్స్ కొత్త స్మార్ట్ ఫోన్


న్యూఢిల్లీ: దేశీయ స్మార్ట్ ఫోన్ మేకర్ ఇంటెక్స్ టెక్నాలజీస్ కొత్త మొబైల్ ను లాంచ్ చేసింది. 'క్లౌడ్ క్యూ 11'  పేరుతో ఓ స్మార్ట్ ఫోన్  ను మంగళవారం భారత మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చింది. దీని ధరను రూ. 4,699లు గా కంపెనీ నిర్ణయించింది.   3డీ  కంటెంట్, ఎల్ఎఫ్టీవై  లాంటి అధునాతన ఫీచర్లు తమ కొత్త  స్మార్ట్ ఫోన్ సొంతమని, వీఆర్ ఎనేబుల్డ్  డివైస్ ను  అమెజాన్ ద్వారా వినియోగదారులకు అందుబాటులో ఉంచడం ఆనందంగా ఉందని ఇంటెక్స్ ఆన్ లైన్ మొబైల్ సేల్స్ జనరల్ మేనేజర్ గుర్విందర్ సోధి ప్రకటించారు.

'క్లౌడ్ క్యూ 11'  ఫీచర్లు

5.5 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే
1280x720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్  
1.3  గిగాహెడ్జ్ క్వాడ్ కోర్ మీడియా టెక్ ప్రాసెసర్,
6.0 ఆండ్రాయిడ్ మార్ష్ మిల్లా ఆపరేటింగ్ సిస్టం,
1 జీబీ ర్యామ్, 8జీబీ  స్టోరేజ్ 3
2జీబీ ఎక్స్ పాండబుల్  మెమొరీ
తెలుపు,నీలంరంగుల్లో అమెజాన్ లో ప్రత్యేకంగా అందుబాటులో ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement