దీపావళికల్లా యాపిల్ వాచ్! | Apple Watch expected to be launched in India | Sakshi
Sakshi News home page

దీపావళికల్లా యాపిల్ వాచ్!

Published Thu, Aug 27 2015 2:06 AM | Last Updated on Mon, Aug 20 2018 2:55 PM

దీపావళికల్లా యాపిల్ వాచ్! - Sakshi

దీపావళికల్లా యాపిల్ వాచ్!

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీ దిగ్గజం యాపిల్ స్మార్ట్ వాచ్‌ను భారత్‌లో ఈ ఏడాదే ప్రవేశపెడుతోంది. పలు దేశాల్లో 2015 ఏప్రిల్ నుంచి అందుబాటులో ఉన్న ఈ వాచ్ దీపావళి నాటికి ఇక్కడి కస్టమర్ల చేతుల్లోకి వచ్చే అవకాశాలున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న స్మార్ట్ వాచ్‌లతో పోలిస్తే అప్లికేషన్లు, పనితీరులో తమ ఉత్పాదన ప్రత్యేకమని యాపిల్ అంటోంది. కంపెనీ అంచనాలను మించి ఈ ఉత్పాదన పలు దేశాల్లో అమ్ముడవడం విశేషం. వాచ్ కలెక్షన్‌లో 18 క్యారట్ యెల్లో గోల్డ్, రోజ్ గోల్డ్ కేస్‌తో రూపొందిన మోడళ్లూ ఉన్నాయి. భారత్‌లో వేరియంట్‌నుబట్టి ధర రూ.22 వేల నుంచి 11 లక్షల వరకు ఉండొచ్చని అంచనా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement