ఈ స్మార్ట్‌వాచ్‌కు అసలు ఛార్జింగ్‌ అవసరం లేదు..! ధర ఎంతంటే..? | Garmin Instinct 2 Solar Smartwatches May Never Need Charging | Sakshi
Sakshi News home page

ఈ స్మార్ట్‌వాచ్‌కు అసలు ఛార్జింగ్‌ అవసరం లేదు..! ధర ఎంతంటే..?

Published Thu, Feb 10 2022 6:17 PM | Last Updated on Fri, Feb 11 2022 8:41 AM

Garmin Instinct 2 Solar Smartwatches May Never Need Charging - Sakshi

స్విస్‌కు చెందిన గార్మిన్ కంపెనీ సరికొత్త స్మార్ట్‌వాచ్‌ను లాంచ్‌ చేసింది. గార్మిన్‌ స్మార్ట్‌వాచ్‌ శ్రేణిలోని ఇన్‌స్టింక్ట్ సిరీస్‌ను విస్తరిస్తూ ఇన్‌స్టింక్ట్ 2 సిరీస్ స్మార్ట్‌వాచ్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. అడ్వెంచర్స్‌ ప్రీక్స్‌ కోసం ఈ స్మార్ట్‌వాచ్‌ను రూపొందించినట్లు కంపెనీ పేర్కొంది. గార్మిన్‌ కొత్తగా లాంచ్‌ చేసిన స్మార్ట్‌వాచ్‌ స్పెషాలిటీ ఏంటంటే ఈ స్మార్ట్‌వాచ్‌కు అసలు ఛార్జింగ్‌ చేయాల్సిన అవసరం లేదు. 

అపరిమిత బ్యాటరీతో..!
ఇన్‌స్టింక్ట్‌ 2 స్మార్ట్‌వాచ్‌లో సోలార్ టెక్నాలజీని జోడించారు. దీంతో గార్మిన్ ఇన్‌స్టింక్ట్ 2 స్మార్ట్‌వాచ్‌కు ఎలప్పుడు ఛార్జింగ్‌ చేయాల్సిన అవసరం లేదు.

ధర ఎంతంటే
గార్మిన్‌ ఇన్‌స్టింక్ట్‌ 2 స్మార్ట్‌వాచ్‌ విభిన్న వేరియంట్లలో రానుంది. ఇన్‌స్టింక్ట్ 2 ధర 349 డాలర్లుగా ఉండగా, ఇన్‌స్టింక్ట్ 2S ధర 349 డాలర్లుగా, ఇన్‌స్టింక్ట్ 2S సోలార్ ధర 449 డాలర్లుగా ఉంది.  ఇన్‌స్టింక్ట్ 2 సర్ఫ్ సోలార్, ఇన్‌స్టింక్ట్ 2 టాక్టికల్ సోలార్  ధర 499 డాలర్లుగా ఉంది.ఈ స్మార్ట్‌వాచ్స్‌ తొలుత యూఎస్‌, యూరోపియన్‌ మార్కెట్లలో అందుబాటులో ఉండనున్నాయి. ఎలక్ట్రిక్ లైమ్, పాపీ, నియో-ట్రాపిక్‌ కలర్స్‌లో లభించనుంది. 

గార్మిన్ ఇన్‌స్టింక్ట్ 2 స్మార్ట్‌వాచ్ స్పెసిఫికేషన్‌లు

  • 45ఎంఎం రౌండ్‌ డయల్‌ డిస్‌ప్లే
  • స్క్రాచ్-రెసిస్టెంట్ గ్లాస్‌
  • థర్మల్, షాక్ రెసిస్టెన్స్ 
  • 100 మీటర్ల వాటర్‌ రెసిస్టెంట్‌
  • ఫిట్‌నెస్‌ యాక్టివిటీ ట్రాక్‌
  • గార్మిన్‌ పే సపోర్ట్‌

చదవండి: కేవలం నెలకు రూ. 125 ఖర్చుతో 15 ఓటీటీ సేవలను ఇలా పొందండి..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement