ఇవీ స్మార్ట్‌వాచ్‌లే...
ఆపిల్ ఐవాచ్ రాకతో స్మార్ట్‌వాచ్ టెక్నాలజీ వేగం పుంజపుకుంటోంది. ఇప్పటికే కొన్ని స్మార్ట్‌వాచీలో మార్కెట్‌లో ఉండగా మరెన్నింటిలో ఇటీవలే ముగిసిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో కంపెనీలు ప్రకటించాయి. ఐవాచ్‌కు ప్రత్యామ్నాయం కాగల కొన్ని వాచీలు ఇలా ఉన్నాయి..
మోటో 360
మోటరోలా సిద్ధం చేసిన ఈ స్మార్ట్‌వాచీ వాయిస్ కమాండ్స్‌ను సపోర్ట్ చేస్తుంది. మోటో మేకర్ వెబ్‌సైట్ ద్వారా మనకు కావాల్సిన విధంగా తీర్చిదిద్దుకునేందుకు ఎన్నో అవకాశాలున్నాయి. ధర 250 డాలర్ల నుంచి మొదలు.
ఆసస్ జెన్ వాచ్
గత ఏడాది విడుదలైన ఈ తైవాన్ స్మార్ట్‌వాచ్ ఐవాచ్ మాదిరిగానే డిజైన్ చేశారు గుండె కొట్టుకునే వేగాన్ని, ఖర్చయ్యే కేలరీలను లెక్కపెట్టగలదు. ధర 200 డాలర్ల వరకూ ఉంటుంది.
ఎల్‌జీ వాచ్ ఆర్బేన్
మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో విడుదలైన స్మార్ట్‌వాచ్ ఇది. వాటర్, డస్ట్ ప్రూఫ్‌గా ఉండటం మెటల్ డిజైన్ దీని ప్రత్యేకతలు. ధర తెలియాల్సి ఉంది.
పెబల్ టైమ్
కిక్ స్టార్టర్ ద్వారా మార్కెట్‌లోకి వచ్చిన గాడ్జెట్ ఇది. ఏడు రోజులపాటు పనిచేసే బ్యాటరీ, ఐఫోన్, ఆండ్రాయిడ్‌లు రెండింటికీ కంపాటబులిటీ దీని ప్రత్యేకతలు. ధర రెండు వందల డాలర్ల వరకూ ఉంటుంది.
హువాయి వాచ్
చైనీస్ తయారీ సంస్థ హువాయి మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో విడుదల చేసిన స్మార్ట్‌వాచీ ఇది. ఈ ఏడాది చివరిలోగా అందుబాటులోకి వచ్చే అవకాశముంది. యాక్టివిటీని ట్రాక్ చేసేందుకు అనేక సెన్సర్లు ఏర్పాటు
చేశారు.