పిల్లల భద్రతకు ఓ స్మార్ట్ ‘వాచ్’! | New smart watch lets parents track their child's location | Sakshi
Sakshi News home page

పిల్లల భద్రతకు ఓ స్మార్ట్ ‘వాచ్’!

Published Tue, Dec 3 2013 2:58 AM | Last Updated on Sat, Sep 2 2017 1:11 AM

New smart watch lets parents track their child's location

వాషింగ్టన్: పిల్లల కిడ్నాప్‌లు, వారిపై నేరాలు పెచ్చుమీరుతున్న ప్రస్తుత తరుణంలో.. వారెక్కడున్నారో ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటే బావుండుననే ఆలోచన ప్రతీ తల్లిదండ్రులకు ఏదోఒక సమయంలో వచ్చే ఉంటుంది. ఆ ఆలోచనకనుగుణమైన ఒక స్మార్ట్‌వాచ్‌ను అమెరికాలో రూపొందించారు.

ఈ జీపీఎస్ ఆధారిత గడియారం ‘ఫిలిప్’ అనే ఒక యాప్(అప్లికేషన్) ద్వారా వారి తల్లిదండ్రుల స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానమై ఉంటుంది. పిల్లలు సాధారణంగా ఎక్కువ సమయం గడిపే ఇల్లు, పాఠశాలలు మొదలైన ప్రాంతాలను సేఫ్ జోన్లుగా ఆ వాచ్, ఫోన్‌లలో స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సేఫ్ జోన్‌లోంచి పిల్లలు బయటకు వెళ్లిన మరుక్షణం ఆ సమాచారం తల్లిదండ్రుల స్మార్ట్‌ఫోన్‌కు తెలిసిపోతుంది. వెంటనే వారు ఆ పిల్లలకు ఫోన్ చేయడం కానీ, మెసేజ్ చేయడం కానీ చేయొచ్చు. అలాగే, ఎమర్జెన్సీ పరిస్థితుల్లో వాచ్‌లోని రెడ్ బటన్‌ను పిల్లలు నొక్కిపట్టుకుంటే.. తక్షణమే వాచ్‌నుంచి సంబంధీకులకు ఫోన్ వెళ్తుంది. వారెక్కడున్నారనే సమాచారమూ తెలుస్తుంది. అలా ఐదుగురి నెంబర్లను ఆ వాచ్‌లో ఫీడ్ చేయొచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement