ఈ ఫొటోలో చేతికి తొడుక్కున్న వాచీ చూస్తున్నారు కదా! ఇది స్మార్ట్ వాచీ. మిగిలిన స్మార్ట్ వాచీల మాదిరిగా దీని బ్యాటరీకి చార్జింగ్ అవసరం లేదు. ఇది పూర్తిగా సోలార్ స్మార్ట్ వాచ్. ఎండలో కాసేపు తిరిగితే చాలు, ఇందులోని బ్యాటరీ చార్జ్ అవుతుంది. అమెరికాకు చెందిన బహుళజాతి సంస్థ ‘గ్రామిన్ ఇంటర్నేషనల్’ ఇటీవల ఈ పూర్తిస్థాయి సోలార్ స్మార్ట్ వాచ్‌ను ‘ఇన్‌స్టింక్ట్–2’ పేరుతో విడుదల చేసింది. దీనికి అమర్చిన లెన్స్ ద్వారా ఇందులోని బ్యాటరీ చార్జ్ అవుతుంది.
రోజుకు మూడుగంటల సేపు ఎండసోకితే, ఈ వాచ్ ఇరవైనాలుగు గంటలు నిరంతరాయంగా పనిచేస్తుంది. ఎండసోకని పరిస్థితులు రోజుల తరబడి ఉంటే, యూఎస్‌బీ చార్జర్ ద్వారా కూడా చార్జ్ చేసుకోవచ్చు. ఈ వాచ్‌లో ఫ్లాష్‌లైట్ కూడా ఉండటం విశేషం. ఆరుబయట పిక్నిక్‌లు, ట్రెక్కింగ్‌లకు వెళ్లే వారికి ఈ వాచ్ పూర్తి అనుకూలంగా ఉంటుందని ‘గ్రామిన్ ఇంటర్నేషనల్’ వైస్ ప్రెసిడెంట్ డాన్ బార్టెల్ చెబుతున్నారు. దీని మోడల్స్‌లో వైవిధ్యాన్ని బట్టి దీని ధర 389.99 డాలర్ల (రూ.32,027) నుంచి 469.99 డాలర్ల (38,597) వరకు ఉంది.
Comments
Please login to add a commentAdd a comment